Suriya 39 : సూర్య ‘జై భీమ్’..

జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి ‘జై భీమ్’ అనే పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు..

Suriya 39 : సూర్య ‘జై భీమ్’..

Jai Bhim

Updated On : July 23, 2021 / 5:51 PM IST

Suriya 39: వెర్సటైల్ యాక్టర్ సూర్య వరుస సినిమాలతో అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. ‘ఆకాశం నీ హద్దురా’ తో ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న సూర్య.. కంటెంట్ ఓరియంటెడ్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ తన స్టైల్లో దూసుకెళ్తున్నారు.

Etharkkum Thunindhavan : సూర్య 40.. ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్..

జూలై 23 సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న రెండు కొత్త సినిమాల అప్‌డేట్స్ ఇచ్చారు మేకర్స్. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న సూర్య 40వ సినిమాకు ‘ఎదర్కుం తునిందవన్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్‌లుక్ వదలగా రెస్పాన్స్ అదిరిపోయింది. శుక్రవారం సాయంత్రం సూర్య 39వ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి ‘జై భీమ్’ అనే పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు.

సూర్య లాయర్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నారు. పోస్టర్‌ని బట్టి, తమ భూముల కోసం పోరాడే పేదల తరపున అండగా నిలబడే పవర్‌ఫుల్ లాయర్‌గా ఆయన కనిపించనున్నారని అర్థమవుతోంది. 2 డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో నటిస్తున్నారు.