Suriya : ఆ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ సూర్యని టార్గెట్ చేశారు.. పొలిటికల్ పార్టీలు కూడా.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు..

తాజాగా కంగువా మూవీ సహా నిర్మాత ధనంజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Suriya Kanguva Co Producer Sensational Comments on Kanguva Failure he Blames Two Heros Fans

Suriya : తమిళ్ స్టార్ హీరో సూర్య తన సినిమాలతో తెలుగులో కూడా మంచి మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇటీవల సూర్య కంగువా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో మొదటి హాఫ్ బాగా సాగదీయడం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరీ ఎక్కువగా ఉండటంతో అనేక విమర్శలు వచ్చాయి.

కంగువా సినిమాపై వచ్చిన విమర్శలకు ఇప్పటికే జ్యోతిక, మూవీ యూనిట్లోని పలువురు స్పందించారు. తాజాగా కంగువా మూవీ సహా నిర్మాత ధనంజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ధనంజయన్ మాట్లాడుతూ.. ఇద్దరు హీరోల అభిమానులు గత కొన్నాళ్లుగా సూర్యని టార్గెట్ చేశారు. ఇప్పుడు రెండు రాజకీయ పార్టీలు కూడా ఆ ఫ్యాన్స్ తో కలిసి సూర్యని కింద పడేయాలని చూస్తున్నాయి. ఆ హీరోలు ఇద్దరూ టాప్ పొజిషన్ లో ఉన్నారు. అయినా వాళ్ళ ఫ్యాన్స్ సూర్యని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలీదు. ముఖ్యంగా ఒక హీరో ఫ్యాన్స్ అయితే సూర్యని ప్రతి రోజు ఓవర్ గా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళే కంగువా సినిమాని కూడా ట్రోల్ చేశారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

Also Read : Divi – Pushpa 2 : పుష్ప 2 డబ్బింగ్ పూర్తిచేసిన ఆ భామ.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు..

దీంతో ధనుంజయన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ అంటే విజయ్, అజిత్ ఫ్యాన్స్ అని అంతా భావిస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ సూర్యని గతంలో కూడా పలుమార్లు ట్రోల్ చేయడంతో వాళ్లనే అన్నారని అందరూ భావిస్తున్నారు. అయితే సినిమా బాగోలేకపోతే ఇలా వేరేవాళ్ళ మీద విమర్శలు చేయడం ఏంటి, కంగువా సినిమా ఫెయిల్ అయితే వాళ్ళను బ్లేమ్ చేయడం ఏంటి అని పలువురు ధనుంజయన్ ని విమర్శిస్తున్నారు. ఇక విజయ్ ఫ్యాన్స్, అజిత్ ఫ్యాన్స్ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.