Surveen Chawla : వినాయకుడి కోసం ఇంట్లోనే స్వర్గాన్ని సృష్టించిన హీరోయిన్.. ఏకంగా కైలాసం సెటప్.. ఫోటోలు వైరల్..

బాలీవుడ్ భామ సుర్వీన్ చావ్లా తన ఇంట్లోని పూజ గదిలో వినాయక చవితికి వినాయకుడి కోసం ఏకంగా స్వర్గం సెటప్ వేసింది.

Surveen Chawla Designed Heaven Setup for Lord Ganesh in her Pooja Room Photos goes Viral

Surveen Chawla : వినాయక చవితి సెలబ్రేషన్స్ దేశమంతటా నేటితో ముగియనున్నాయి. ఇప్పటికే మన సెలబ్రిటీలు చాలా మంది తమ ఇళ్లల్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ వేడుకలను ఫోటోలు తీసి తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ తన ఇంట్లో చేసిన వినాయక చవితి సెలబ్రేషన్స్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

బాలీవుడ్ భామ సుర్వీన్ చావ్లా తన ఇంట్లోని పూజ గదిలో వినాయక చవితికి వినాయకుడి కోసం ఏకంగా స్వర్గం సెటప్ వేసింది. కైలాసం గుర్తొచ్చేలా వినాయకుడి చుట్టూ మేఘాలు సెట్ చేసి, వెనక చంద్రుడిని పెట్టి అందంగా డిజైన్ చేసింది.

తాజాగా వినాయక చవితి నిమజ్జనం రోజు తన ఇంట్లో అందంగా డిజైన్ చేసిన వినాయకుడి సెటప్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

వినాయకుడిని ఇంత అందంగా చూపించడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. హీరోయిన్ సుర్వీన్ చావ్లా అందంగా వినాయకుడి కోసం డిజైన్ చేసింది అని ఆమెని అభినందిస్తున్నారు. ఈ ఫోటోల్లో వినాయకుడిని చూసి మురిసిపోతున్నారు భక్తులు.

ఇక సుర్వీన్ చావ్లా తెలుగులో శర్వానంద్ సరసన రాజు మహారాజు అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో కనపడలేదు. బాలీవుడ్ లో వరుస సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉన్న ఈ భామ ఇటీవల రానా నాయిడు సిరీస్ లో నటించి అలరించింది.