Surya : మరోసారి సూర్య దాతృత్వం.. రియల్ సినతల్లికి 10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్

సినిమాలో సినతల్లి పాత్రకి రియల్ లో పార్వతి అమ్మాళ్ అనే ఆవిడ స్ఫూర్తి. ప్రస్తుతం ఆమె చాలా కష్టాల్లో ఉంది. ఈ సినిమాతో తన గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. ఇటీవలే రాఘవ లారెన్స్

Surya

Surya :  తమిళ్ స్టార్ హీరో సూర్య ఒక పక్క కమర్షియల్ సినిమాలతో పాటు నటనకి ప్రాధాన్యం, కథ ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా జస్టిస్ చంద్రు బయోపిక్ తో ‘జై భీమ్’ సినిమాతో వచ్చి సూర్య మరోసారి అద్భుతమైన విజయం సాధించాడు. చంద్రూ అనే ఒక అడ్వకేట్ జీవిత చరిత్రని, ఒక కేసు విషయంలో నిస్వార్థంగా ఆయన చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ‘జై భీమ్’ సినిమాను చేశాడు సూర్య.

Trisha : వీరాభిమాని మరణంతో విషాదంలో త్రిష

ఈ సినిమా దీపావళి కానుకగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. సూర్య సొంత బ్యానర్లో ఈ సినిమాని నిర్మించడం విశేషం. ఈ సినిమాకి జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా గురించి అందరూ చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. ‘జై భీమ్’ సినిమా ఒక గిరిజన యువకుడి లాకప్ డెత్ కి సంబంధించిన కథ. ఇందులో ఉన్న అందరూ చాలా బాగా నటించారు. విమర్శకులు సైతం ప్రశంశలు తెలియచేస్తున్నారు. సూర్యకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Most Eligible Bachelor : ఆహాలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’

ఈ సినిమాతో ఇందులోని రియల్ పాత్రలు కూడా అందరికి తెలిశాయి. సినిమాలో సినతల్లి పాత్రకి రియల్ లో పార్వతి అమ్మాళ్ అనే ఆవిడ స్ఫూర్తి. ప్రస్తుతం ఆమె చాలా కష్టాల్లో ఉంది. ఈ సినిమాతో తన గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. ఇటీవలే రాఘవ లారెన్స్ ఆమెకు సొంత ఇల్లు కటిస్తానని ప్రామిస్ చేశారు. తాజాగా హీరో సూర్య పార్వతి అమ్మాళ్ కుటుంబానికి 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేసారు. ఈ మొత్తంపై నెల నెలా వచ్చే వడ్డీ పార్వతి అమ్మాళ్ కి చేరుతుంది. ఆమె తదనంతరం ఆమె పిల్లలకు అందజేస్తామని సూర్య తెలిపారు.

Manchu Lakshmi : మోహన్ లాల్ సినిమాలో మంచు లక్ష్మి ఫిమేల్ లీడ్

సూర్య రీల్ హీరోనే కాదు రియల్ హీరో అని మరోసారి ప్రూవ్ చేశారు. ఇప్పటికే అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సేవలు చేస్తున్నాడు. ఎంతో మంది పిల్లల్ని చదివిస్తున్నాడు. ఎన్నో సేవా కార్యక్రమాల్ని చేపడుతున్నాడు. తాజాగా సూర్య తీసుకున్న ఈ నిర్ణయంతో మరోసారి ఆయనని అభినందిస్తున్నారు.