Rhea Chakraborty : సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ కేసు.. సుప్రీం కోర్టులో బాలీవుడ్ న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తికి ఊరట

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి ఊర‌ట ల‌భించింది.

Supreme Court rejects CBI plea against actor Rhea Chakraborty

Rhea Chakraborty: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి ఊర‌ట ల‌భించింది. నటితోపాటు ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తిపై సీబీఐ జారీ చేసిన లుక్‌అవుట్‌ సర్క్యూలర్‌ను (ఎల్‌ఓసీ)ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు స‌మ‌ర్థించింది. బాంబే హైకోర్టు ఉత్త‌ర్వుల‌ను స‌వాల్ చేస్తూ సీబీఐ, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం వేసిన పిటిష‌న్‌ను దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం కొట్టివేసింది.

2020 జూన్ 14న ముంబైలోని త‌న నివాసంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించారు. ఆయ‌నది ఆత్మ‌హ‌త్య కాదంటూ న‌టుడి కుటుంబ స‌భ్యులు రియా చ‌క్ర‌వ‌ర్తి, ఆమె ఫ్యామిలీపై కేసు పెట్టారు. ఆ త‌రువాత ఈ కేసును సీబీఐకి అప్ప‌గించారు. ప‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న రియా, ఆమె సోద‌రుడు జైలు వెళ్లిన విష‌యం తెలిసిందే.

Sai Durga Tej : ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి.. యాక్సిడెంట్ రోజును గుర్తుచేసుకున్న సాయి దుర్గ తేజ్..

ఈ క్ర‌మంలోనే రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి లు విదేశాల‌కు వెళ్ల‌కుండా సీబీఐ గ‌తంలోనే ఎల్‌వోసీ జారీ చేసింది. దీనిపై న‌టి బాంబే కోర్టును ఆశ్ర‌యించ‌గా.. దానిని న్యాయ‌స్థానం ర‌ద్దు చేసింది. బాంబే కోర్టును ఇచ్చిన తీర్పును మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం స‌వాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది. తాజాగా ఈ తీర్పు వెలువ‌డింది.