సుశాంత్ కట్టిన ఈఎమ్ఐ రూ.4.5కోట్లు మాజీ ప్రియురాలి కోసమేనట

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక విషయం బయటపడింది. ఇన్ని రోజులు రియా చక్రవర్తి వైపు నుంచే ఏదైనా జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులకు మరో అంశం వెలుగులోకి వచ్చి షాక్ ఇచ్చింది. రియా చక్రవర్తికి ముందు మాజీ ప్రియురాలు అంకితా లోఖండే ఇందులో ప్రధాన అంశంగా మారింది.

తన కొడుకు అకౌంట్ నుంచి రూ.15కోట్లు మాయమయ్యాయంటూ సుశాంత్ తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై ప్రశ్నించిన ఈడీ.. ఆ డబ్బుల్లో రూ.4.5కోట్లు ఓ ప్లాట్ ఈఎమ్ఐగా కట్ అయ్యాయని రియా చక్రవర్తి ద్వారా తెలుసుకుంది. ఆ ప్లాట్ లో అంకితా లోఖండే ఉంటుందని.. సుషాంత్ కు ఆమెకు బ్రేకప్ అయిపోయాక కూడా ఆ ప్లాట్ ఖాళీ చేయమని సుశాంత్ చెప్పలేదని రియా చెప్పుకొచ్చింది.

సుశాంత్‌ ఆస్తుల గురించి ఈడీ రియాను ప్రశ్నించినప్పుడు ముంబైలోని మలాడ్‌లో ఈ ప్లాట్‌ గురించి చెప్పింది. ఈ ప్లాట్‌ తీసుకుని కొన్ని సంవత్సరాలు అవుతుంది. దాంతో అప్పటి విలువ ఎంతో తెలియలేదు. సుశాంత్‌కు చెందిన ఒక అకౌంట్‌ నుంచి ఈ ఈఎమ్‌ఐలు నెలా కట్‌ అవుతున్నట్లు ఈడీ గుర్తించింది. కొద్ది నెలలుగా అవి పెండింగ్‌లో ఉన్నట్లు గమనించింది.

సుశాంత్‌ కేసును సీబీఐకి అప్పగించాల్సిందేనంటూ అంకితా లోంఖడే‘జస్టిస్‌ ఫర్‌ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌’ పేరుతో ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.