Sushmita Konidela: రామ్ చరణ్ తో నెక్స్ట్ సినిమా.. క్యూలో ఉన్నాను.. సుష్మిత ఆసక్తికర కామెంట్స్
తన తమ్ముడు రామ్ చరణ్ తో సినిమా చేయడంపై ఆసక్తికర కామెంట్స్ చేసిన సుష్మిత కొణిదెల(Sushmita Konidela).
Sushmita Konidela next film is with Ram Charan.
- తమ్ముడు చరణ్ తో సినిమాపై సుష్మిత ఆసక్తికర కామెంట్స్
- చేయడానికి నేను రెడీగా ఉన్నాను
- కానీ పెద్ద క్యూ ఉందంటూ కామెంట్స్
Sushmita Konidela: సినిమా ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం కామన్ కానీ, ఈ మధ్య కూతుళ్లు కూడా తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్స్ కూతుళ్లు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మిత కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఆమె నటిగా కాకుండా
నిర్మాతగా వచ్చింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాలు చేస్తూ వస్తోంది. తాజాగా సుష్మిత(Sushmita Konidela) నిర్మాతగా వచ్చిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు.
తండ్రి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది సుష్మిత. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా విడుదలై రీజనల్ సినిమాల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీంతో, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు నిర్మాత స్టార్ పొజిషన్ కి చేరింది సుష్మిత. దీంతో, ఆమె నెక్స్ట్ చేయబోయే సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఏ హీరోతో చేస్తారు? ఏ దర్శకుడితో చేస్తారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Pawan Kalyan: పవన్ సినిమాకి మ్యూజికల్ కన్ ఫ్యూజన్.. ఆప్షన్ లో అనిరుధ్, తమన్.. ఫ్యాన్స్ ఛాయస్ అదే!
ఇంకా కొంతమంది అయితే, డాడీతో మన శంకర వరప్రసాద్ గారు సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు, అలాగే రామ్ చరణ్ తో కూడా సినిమా చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల సుష్మిత ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ కూడా అదే ప్రశ్న వేశారు. తమ్ముడు రామ్ చరణ్ తో సినిమా ఎప్పుడు చేస్తున్నారు అంటూ అడిగాడు.
దానికి సుష్మిత కూడా చాలా హ్యాపీ ఫీలయ్యారు. రామ్ చరణ్ ఇప్పుడు చాలా పెద్ద స్టార్. చాలా మంది నిర్మాతలు తనతో సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అలానే నేను కూడా క్యూలో ఉన్నాను. ఈ విషయం తనకు చెప్తాను అంటూ చెప్పుకొచ్చింది సుష్మిత. దీంతో, సుష్మిత చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, తన నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుంది అనే విషయంపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు సుష్మిత.
