100 Crores : ‘ఆహా’లో మరో థ్రిల్లింగ్ సినిమా.. ‘100 క్రోర్స్’.. దయ్యాలు డబ్బులు ఎత్తుకుపోవడం ఏంటి?
100 క్రోర్స్ సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీలో రిలీజ్ అయింది.

Suspense Thriller 100 Crores Movie Released in Aha OTT
100 Crores : హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్, చేతన్ కుమార్, సాక్షి చౌదరి, అమీ ఏల, ఐశ్వర్య రాజ్ పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘100 క్రోర్స్’. SS స్టూడియోస్ పతాకంపై దివిజ కార్తీక్, సాయి కార్తీక్ నిర్మాణంలో విరాట్ చక్రవర్తి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గత సంవత్సరం సెప్టెంబర్ 20న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజవ్వగా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
Also Read : Tollywood : టాలీవుడ్ టాప్ హీరోల కొత్త స్ట్రాటజీ?
రెగ్యులర్ గా కొత్త కొత్త సినిమాలు, షోలు, సిరీస్ లతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా ఓటీటీలో ఈ 100 క్రోర్స్ సినిమా నేడు జనవరి 11న విడుదల కానుంది. పలు తెలుగు, డబ్బింగ్ సినిమాలను ఆహాలో రిలీజ్ చేసిన హనుమాన్ మీడియా ద్వారా ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా హనుమాన్ మీడియా అధినేత బాలు చరణ్ మాట్లాడుతూ.. 100 క్రోర్స్ ఒక యాక్షన్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. జనవరి 11న ఆహాలో విడుదలయ్యే ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. థియేటర్లలో ఈ సినిమా మిస్ అయితే ఓటీటీలో మాత్రం మిస్ అవ్వకండి అని తెలిపారు. ఈ సినిమాతో సంగీత దర్శకుడు సాయి కార్తీక్ నిర్మాతగా మారడం విశేషం.
Also Read : Preminchoddu : ఓటీటీలోకి వచ్చేసిన వివాదాస్పద సినిమా ‘ప్రేమించొద్దు’.. బేబీ కేసు ఇంకా కోర్టు లోనే..
ఆర్బీఐ నుంచి వచ్చే 500 కోట్లు మిస్ అవ్వడం, అలాగే ఓ డబ్బున్న వ్యక్తి ఇంట్లో 100 కోట్లు మిస్ అవ్వడం, అవి ఎలా మిస్ అయ్యాయి? ఏమయ్యాయి అనే సస్పెన్స్ కథాంశంతో ఈ సినిమా ఉండనుంది. ఆహా 100 క్రోర్స్ ట్రైలర్ మీరు కూడా చూసేయండి..