Preminchoddu : ఓటీటీలోకి వచ్చేసిన వివాదాస్పద సినిమా ‘ప్రేమించొద్దు’.. బేబీ కేసు ఇంకా కోర్టు లోనే..
ఈ ప్రేమించొద్దు సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది.

Preminchoddu Movie Streaming in OTT Details Here
Preminchoddu : అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘ప్రేమించొద్దు’.. ‘డోంట్ లవ్’ ట్యాగ్ లైన్. శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్ పై శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. గత సంవత్సరం జూన్ లో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజయింది.
Also Read : Tollywood : టాలీవుడ్ టాప్ హీరోల కొత్త స్ట్రాటజీ?
తెలిసీ తెలియని వయసులో ప్రేమించొద్దు అనే కాన్సెప్ట్ తో కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని కాలేజీ, స్కూల్ లవ్ స్టోరీలు, ప్రస్తుత జనరేషన్ ఎలా ఉంటున్నారు అని చూపిస్తూ ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పుడు ఈ ప్రేమించొద్దు సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమాను ‘బి సినీ ఈటీ’ (Bcineet) కంపెనీ ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ రిలీజ్ చేస్తుంది.
ప్రస్తుతం ప్రేమించొద్దు సినిమా అమెజాన్ ప్రైమ్, బి సినీ ఈటీ ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ఓ డిఫరెంట్ లవ్ స్టోరీతో ప్రేమించొద్దు అనే సినిమాని తీసాను. థియేటర్స్ లో ఆదరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయింది అని తెలిపారు.
Also Read : Daaku Maharaaj Release Trailer : బాలయ్య ‘డాకు మహారాజ్’ రిలీజ్ ట్రైలర్.. ఫ్యాన్స్‌కు పూనకాలే..
గతంలో ఈ కథనే మార్పులు చేసి బేబీ సినిమా తీసారని సాయి రాజేష్ పై ఆరోపణలు చేసాడు డైరెక్టర్. తాజాగా మరోసారి దానిపై స్పందిస్తూ.. ప్రేమించొద్దు సినిమా ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పి అదే కథ లో మార్పులు చేసుకొని బేబీ సినిమా తీశారు. నా సినిమా కథను దొంగిలించారని గతంలోనే బేబీ సినిమా నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆ కేసు ప్రస్తుతం కోర్టులో కొనసాగుతుంది అని తెలిపారు.