నటుడి కూతురు ఇంట్లో పనిమనిషికి కరోనా.. దెబ్బకి ఇంట్లో అందరూ!..

హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానే ఖాన్ సోదరి ఇంట్లో పనిమనిషికి కరోనా పాజిటివ్..

  • Publish Date - April 15, 2020 / 10:07 AM IST

హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానే ఖాన్ సోదరి ఇంట్లో పనిమనిషికి కరోనా పాజిటివ్..

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానే ఖాన్ సోదరి, Jewellery Designer ఫరాఖాన్ అలీ ఇంటి పనిమనిషికి కరోనా వైరస్ సోకింది. దీంతో ముందు జాగ్రత్తగా ఫరాఖాన్ అలీ కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు చేసి వారిని సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంచారు. తమ ఇంటి పనిమనిషికి కరోనా వైరస్ సోకడంతో ఆమెను BMC (Brihanmumbai Municipal Corporation)అధికారులు, వైద్యులు ఆసుపత్రికి తరలించారు.

‘‘మా ఇంటి పనిమనిషికి కరోనా సోకిందని తేలడంతో అధికారులు అత్యంత వేగంగా ఆసుపత్రికి తరలించారు… ఈ సందర్భంగా వైద్యులు, అధికారులను ప్రశంసిస్తున్నా.. వారు కరోనా రోగిని తరలించిన విధానం అద్భతంగా ఉంది. వారు దయ, మానవత్వంతో వ్యవహరించారు’’ అని ఫరాఖాన్ అలీ ట్వీట్ చేశారు. ఫరా, సుజానే, సిమోన్, నటుడు జాయేద్ ఖాన్ లు ప్రముఖ నటుడు సంజయ్ ఖాన్, జరీనాల పిల్లలు. ఫరాఖాన్ అలీ డీజే అఖిల్‌ను వివాహమాడారు.

Read Also : అంబ థియేటర్ హౌస్‌ఫుల్..

కరోనా కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్ అయిన నేపథ్యంలో తమ పిల్లల కోసం హృతిక్, సుసానే ఒకే ఇంట్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. తమ పిల్లలు హ్రేహాన్, హృదాన్‌కు అండగా నిలిచేందుకు సుసానే తన ఇంటికి వచ్చిందని, లాక్‌డౌన్ ముగిసే వరకు   తామందరం కలిసే ఉంటామని తెలిపాడు హృతిక్.