కొండ మీద శ్రీనివాసుడు..కొండ కింద విషసర్పాలు : పృథ్వీ సంచలన వ్యాఖ్యలు

30 ఇయర్స్ ఇండస్ట్రీ..అంటూ పాపులర్ అయిన నటులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చాలా సంవత్సరాల పాటు..ఎన్నో సమస్యలపై మాట్లాడారు పృథ్వీ. అనంతరం SVBC ఛైర్మన్ పదవిలో నామినేటెడ్ అయిన సంగతి తెలిసిందే. తర్వాత..అనుహ్య పరిణామాలు, వివాదాస్పదాల మధ్య..రాజీనామా చేశారు. కొంతకాలం పాటు..పరిస్థితులు స్తబ్దుగా ఉన్నా, పృథ్వీ రాజ్ సైలెంట్ ఉన్నా కూడా..మరొక్కసారి తెరపైకి వచ్చారు..10tvతో పృథ్వీరాజ్ గళం విప్పిమాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
2018లో కార్యదర్శిగా చేయడం జరిగిందని, మహిళా కార్యకర్తల నడుమ తాను పనిచేయడం జరిగిందన్నారు. సినిమా రంగంలో 30 సంవత్సరాల నుంచి ఉన్నట్లు..కానీ వివాదాల జోలికి వెళ్లనన్నారు. తీవ్రమైన ఆరోపణలు పెట్టారని, మనిషికి కుటుంబం, స్నేహితులు, సమాజం ఉంటుందని మరిచిపోయారన్నారు. తనతో మాట్లాడుతుంటే..చాలా బాదేస్తుందన్నారు. పదవిపై ఆశలు లేదని, తాను కుర్చీలో కూర్చొన్న సమయంలోనే తనను ఐదు రోజుల్లో వెళ్లిపోతానని అని అర్థమైందన్నారు. కొండ కింద విషసర్పాలున్నాయని, వీరి మధ్యలో ఐదు నెలల పాటు బతికినట్లు చెప్పారు. లౌక్యం సినిమాలో నటించానే కానీ..లౌక్యం తెలియకుండా బతకలేదన్నారు.
బ్రహ్మోత్సవాల సమయంలో తనపై ఆరోపణలు స్టార్ట్ అయ్యాయని వెల్లడించారు. దర్శకుడు రాఘవేంద్రపై తాను ఎందుకు ఆరోపణలు చేసే వ్యక్తిని తాను కాదన్నారు. మందు తాగకుండా..సంవత్సరం అయ్యిందన్నారు. ఫోన్ తన దగ్గర ఉండేది కాదని, ఇతరుల దగ్గర ఉండేదన్నారు. ఏది వచ్చినా..వారు మాట్లాడే వారనన్నారు. ఏమి మాట్లాడుతున్నారో తనకు తెలియదన్నారు. అమరావతి ఉద్యమ సమయంలో సామాజిక వర్గాలన్ని టార్గెట్ చేయలేదని చెప్పుకొచ్చారు.
నటుడు పోసాని తనతో బాగుంటుడాని, సరదాగా మాట్లాడుతాడనన్నారు. తమ మధ్య గొడవలు, దూరమయ్యేంత స్నేహం లేదన్నారు. మరలా పిలిపిస్తే..శ్రీవారి సేవ కోసం పనిచేస్తానని, ఎస్వీబీఎస్ రూంలో ఉండనని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఫర్ ఫెక్ట్ మ్యాన్ అని భావించి..అతని బాటలో నడవాలని అనుకుని వెళ్లానని పృథ్వీ రాజ్ వెల్లడించారు. పదవి ఈ రోజు ఉంటుంది..రేపు పోతది..కానీ పార్టీ ఉంటుందన్నారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో తాను క్లోజ్‌గా ఉండేవారంటూ..కామెంట్ చేసేవారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరూ చీఫ్‌గా చూడలేదన్నారు. తాను ఏ మాత్రం తప్పుచేయలేదని పృథ్వీ రాజ్ మరోసారి స్పష్టం చేశారు.
Read More :కేక్‌లో వెన్నకు బదులు పురుగుల లార్వా..ట్రై చేస్తారా