శభాష్ ‘సైరా’ : చిరుని అభినందించిన గవర్నర్ తమిళిసై

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘సైరా నరసింహారెడ్డి’.. చిత్రాన్ని తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళిసై కుటుంబ సభ్యులతో కలిసి చూశారు..

  • Published By: sekhar ,Published On : October 9, 2019 / 09:35 AM IST
శభాష్ ‘సైరా’ : చిరుని అభినందించిన గవర్నర్ తమిళిసై

Updated On : October 9, 2019 / 9:35 AM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘సైరా నరసింహారెడ్డి’.. చిత్రాన్ని తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళిసై కుటుంబ సభ్యులతో కలిసి చూశారు..

తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళిసై.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రాన్ని చూశారు. సాత్వంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన హిస్టారికల్ మూవీ.. ‘సైరా నరసింహారెడ్డి’..

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ‘సైరా’ భారీగా విడుదలైంది. ‘సైరా’ మూవీ పాజిటివ్ టాక్ దక్కించుకోవడమే కాక.. భారీగా వసూళ్లు రాబడుతుంది. పలువురు సెలబ్రిటీలు ‘సైరా’ చూసి సోషల్ మీడియా ద్వారా రెస్పాన్స్ తెలియచేస్తున్నారు. ఇటీవల తెలంగాణా రాష్ట్ర గవర్నర్, డా. తమిళసై గారిని మెగాస్టార్ చిరంజీవి మర్యాద పూర్వకంగా కలిసి, దసరా శుభాకాంక్షలు తెలియచేసి.. ‘సైరా’ చిత్రాన్ని చూడవలసిందిగా కోరిన సంగతి తెలిసిందే.

Read Also : ఎవ్వరికీ చెప్పొద్దు : అందరికీ చెప్పండి ‘సీక్రెట్ సూపర్ హిట్’ అని!

ఈ మేరకు దసరా పండుగ రోజు ప్రసాద్ ల్యాబ్స్‌లో గవర్నర్ కోసం ‘సైరా’ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి తమిళిసై సినిమా చూశారు. అనంతరం.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి అద్భుతంగా నటించారని ప్రశంసిస్తూ, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు గవర్నర్ మరియు వారి కుటుంబ సభ్యులు..