Tamannaah Bhatia
Tamannaah Bhatia : టాలీవుడ్ లో కొన్నాళ్ళు స్టార్ హీరోయిన్ గా రూల్ చేసిన తమన్నా తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. బాలీవుడ్ కి వెళ్లినా అడపాదడపా సౌత్ సినిమాల్లో కనిపిస్తుంది. ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్ళు అయినా తమన్నా అదే గ్లామర్ మెయింటైన్ చేస్తూ దూసుకుపోతుంది.(Tamannaah Bhatia)
అయితే తమన్నాకు బాహుబలి సినిమా విషయంలో మాత్రం అన్యాయం జరిగిందని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేసారు. తమన్నా కూడా బాహుబలి సినిమా విషయంలో నిరాశ చెందింది అని గతంలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి.
Also Read : Navya Naveli : అమితాబ్ బచ్చన్ మనవరాలు.. బాలీవుడ్ రమ్మన్నా నో చెప్పి.. ట్రాక్టర్స్ బిజినెస్ లోకి..
బాహుబలి 1 సినిమాలో తమన్నా చుట్టూ కథ ఎక్కువగానే తిరుగుతుంది. బాహుబలి 2 లో మాత్రం తమన్నా సీన్స్, తమన్నా యాక్షన్ సీక్వెన్స్ లు ఎడిటింగ్ లో తీసేసారు. దీనిపై తమన్నా బాధపడినట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే తమన్నా బాహుబలి గురించి ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో గతంలో మాట్లాడుతూ.. నా సీన్స్ తీసేసినా నేను హ్యాపీనే. సెకండ్ పార్ట్ లో నా రన్ టైం తక్కువగా ఉంటుందని చెప్పారు. నాకు ఆ సినిమాతో మంచి ఛాన్స్ ఇచ్చారు. కానీ నేను బాహుబలి సక్సెస్ ని నా కెరీర్ కి ఉపయోగించుకోలేకపోయాను. ఆ సినిమాలో ప్రభాస్, రానాలకే ఎక్కువ ఫేమ్ వచ్చింది అని తెలిపింది.
అప్పుడు బాహుబలి 2లో తమన్నా సీన్స్ కట్ చేయడమే కాదు ఇప్పుడు కూడా బాహుబలి ఎపిక్ లో తమన్నా సీన్స్ ఎక్కువగా కట్ చేశారట. బాహుబలి రెండు పార్టులను కలుపుతూ బాహుబలి ఎపిక్ అని అక్టోబర్ 31న ఒకే సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్, రానా , రాజమౌళి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు.
Also Read : Mahesh Babu : బాహుబలి రిలీజ్ బిజీలో రాజమౌళి.. ఈ గ్యాప్ లో సముద్రంలో సాహసాలు చేస్తున్న మహేష్.. పోస్ట్ వైరల్..
ఈ ఇంటర్వ్యూలో బాహుబలి రెండు సినిమాలని కలిపి ఒకే సినిమాగా చేయడానికి చాలానే ఎడిటింగ్ లో తీసేసాం అని చెప్తూ ఏయే సన్నివేశాలు తీసేసారో చెప్పారు రాజమౌళి. రాజమౌళి చెప్పిన లిస్ట్ లో తమన్నా – ప్రభాస్ లవ్ ట్రాక్ మొత్తం తీసేశారని, అలాగే పచ్చబొట్టేసిన సాంగ్ కూడా తీసేశారని తెలిపారు. దీంతో ఈసారి కూడా తమన్నా సీన్స్ ఎక్కువగా ఎడిటింగ్ లో పోయాయని తెలుస్తుంది.
దీంతో నెటిజన్లు బాహుబలి 2 సమయంలో, ఇప్పుడు బాహుబలి ఎపిక్ లో కూడా ఎడిటింగ్ లో తమన్నానే బలి అయింది. తమన్నా సీన్స్ ఎక్కువ కట్ చేసారు అని సింపతీ చూపిస్తున్నారు. పాపం కూరలో కరివేపాకు తేసేసినట్టు ప్రతిసారి తమన్నా సీన్స్ తీసేసాతున్నారని సరదా మీమ్స్ చేస్తున్నారు. మరి బాహుబలి ఎపిక్ విషయంలో తమన్నా ఏమైనా మాట్లాడుతుందా చూడాలి. మొత్తానికి బాహుబలి సినిమా విషయంలో తమన్నాకి మాత్రం అన్యాయం జరిగిందని ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
Also Read : Rajamouli : బాహుబలి డిజాస్టర్ టాక్.. పార్ట్ 2 చూసి నిద్ర రావడంతో అది కూడా ఫ్లాప్ అనుకున్న రాజమౌళి..