Tamannaah : అభిమానితో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో తమన్నా డాన్స్.. వీడియో వైరల్..

అభిమానితో కలిసి ‘వా నువు కావాలయ్యా’ సాంగ్ కి ఎయిర్‌పోర్ట్‌లో స్టెప్పులు వేసిన తమన్నా. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.

Tamannaah dance with fan for Kaavaalaa song at mumbai airport video viral

Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఫుల్ ఫార్మ్ లో ఉంది. వరుసపెట్టి సినిమాలను రిలీజ్ సిద్ధం చేస్తూ ప్రమోషన్స్ తో తెగ సందడి చేస్తుంది. ఇటీవలే లస్ట్ స్టోరీస్ 2 (Lust Stories) తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ భామ.. ఇప్పుడు మరో రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతుంది. చిరంజీవి ‘భోళా శంకర్’ (Bholaa Shankar), రజినీకాంత్ ‘జైలర్’ (Jailer) సినిమాలు ఆగష్టులో ఒక రోజు గ్యాప్ తో రిలీజ్ కాబోతున్నాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీలోని పాటలను రిలీజ్ చేస్తున్నారు.

Bimbisara 2 : చిరంజీవి మూవీతో బింబిసార సీక్వెల్ విషయంలో గొడవ.. కల్యాణ్‌రామ్ ససేమేరా..

ఈ క్రమంలోనే ఇటీవల జైలర్ చిత్రం నుంచి ‘వా నువు కావాలయ్యా’ సాంగ్ ని రిలీజ్ చేశారు. అనిరుద్ సంగీతం అందించిన ఈ పాటకి జానీ మాస్టర్ డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. ఇక ఈ పాట యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ అందుకుంటూ ట్రెండ్ అవుతుంది. తాజాగా తమన్నా ముంబయి ఎయిర్‌పోర్టులో కనిపించగా అక్కడ ఒక అభిమాని ‘కావాలయ్యా’ సాంగ్ కి తనతో కలిసి డాన్స్ వేయాలంటూ కోరాడు. అందుకు తమన్నా కూడా అంగీకరించడంతో.. ఇద్దరు కలిసి ఆ పాటకి ఎయిర్‌పోర్ట్‌లో డాన్స్ వేసి అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Katrina Kaif : గత 20 ఏళ్లగా నా లైఫ్‌లోని ఎక్కువ సమయం అతనితో ఉన్నాను.. కత్రినా పోస్ట్ ఎవరి గురించి?

ఇది ఇలా ఉంటే, ఈ సాంగ్ పై తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్‌ వర్మ (Vijay Varma) చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ పాటను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ఈ సాంగ్ ఫైర్.. సినిమా దేవుడు, దేవత అని పోస్ట్ చేశాడు. అంటే పాటలో సినిమా దేవుడు రజినీకాంత్, సినిమా దేవత తమన్నా ఉన్నారు అంటూ చెప్పాడు. అయితే ఈ పొగడ్త మరీ ఓవర్ అయిందని పలువురు కామెంట్స్ చేస్తుండగా, గర్ల్ ఫ్రెండ్‌ని బాగానే పొగుడుతున్నారు అంటూ కొంతమంది పాజిటివ్ గా కూడా కామెంట్స్ చేస్తున్నారు.