Katrina Kaif : గత 20 ఏళ్లగా నా లైఫ్‌లోని ఎక్కువ సమయం అతనితో ఉన్నాను.. కత్రినా పోస్ట్ ఎవరి గురించి?

గత 20 ఏళ్లగా తన లైఫ్‌లో ఎక్కువ సమయం అతనితో ఉన్నాను అంటూ కత్రినా ఒక ఫోటో షేర్ చేసింది. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..?

Katrina Kaif : గత 20 ఏళ్లగా నా లైఫ్‌లోని ఎక్కువ సమయం అతనితో ఉన్నాను.. కత్రినా పోస్ట్ ఎవరి గురించి?

Katrina Kaif shares emotional post on her personal assistant

Updated On : July 11, 2023 / 7:08 PM IST

Katrina Kaif : అందాల భామ కత్రినా కైఫ్.. 2021 లో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal) ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత కూడా సినిమాలు చేస్తూ వస్తున్న ఈ భామ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ వేసింది. గత 20 ఏళ్లగా తన లైఫ్‌లో ఎక్కువ సమయం అతనితో ఉన్నాను అంటూ చెప్పుకొస్తూ ఒక ఫోటో షేర్ చేసింది. ఇక ఆ ఫోటో చూసిన నెటిజెన్స్ ఆ వ్యక్తి ఎవరు అంటూ నెట్టింట తెగ వెతికేస్తున్నారు.

Nani30 : ఆకాశంలో విహరిస్తూ అప్డేట్ ఇచ్చిన నాని.. ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్..!

కత్రినా ఏమి రాసుకొచ్చింది అంటే.. “గత 20 ఏళ్లగా నేను అశోక్ శర్మతోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాను. నన్ను మోటివేట్ చేయడం, నవ్వించడం, నాతో గొడవ పడడం, నన్ను సరైన దారిలో నడిపించడం, నన్ను కాపాడుకోవడం.. ఇలా ప్రతి దానిలో ఆయన ఉన్నారు. ఎప్పుడు నన్ను ఒక కంట కనిపెట్టుకుంటూ నాకు ఏమి కావాలో ముందుగానే ఏర్పాటు చేస్తూ నాతో నడుస్తూ వస్తున్నారు. మరో 20 ఏళ్ళ పాటు కూడా ఇది ఇలాగే కొనసాగాలి” అంటూ పేర్కొంది.

OG Movie : నాలుగో షెడ్యూల్ మొదలుపెట్టబోతున్న సుజిత్.. ఈ షెడ్యూల్‌లో ఎమోషనల్ డ్రామా..!

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే.. కత్రినా పర్సనల్ అసిస్టెంట్ అశోక్ శర్మ. కత్రినా కెరీర్ 2003 లో మొదలైంది. అప్పటి నుంచి ఆమెతో పాటు అశోక్ శర్మ కొనసాగుతూ వస్తున్నాడు. ఇక కత్రినా ప్రెజెంట్ సినిమా ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్‌తో టైగర్ 3 (Tiger 3) సినిమాలో నటిస్తుంది. విజయ్ సేతుపతితో కలిసి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ‘మెర్రీ క్రిస్మస్‌’ (Merry Christmas) అనే క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తుంది. అలాగే ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తున్న ‘జీ లే జరా’లో ప్రియాంక చోప్రా మరియు అలియా భట్‌ లతో కలిసి కత్రినా స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది.