OG Movie : నాలుగో షెడ్యూల్ మొదలుపెట్టబోతున్న సుజిత్.. ఈ షెడ్యూల్‌లో ఎమోషనల్ డ్రామా..!

పవన్ కళ్యాణ్ OG మూవీ నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నాలుగో షెడ్యూల్..

OG Movie : నాలుగో షెడ్యూల్ మొదలుపెట్టబోతున్న సుజిత్.. ఈ షెడ్యూల్‌లో ఎమోషనల్ డ్రామా..!

Pawan Kalyan OG Movie 4th schedule will be start soon

Updated On : July 11, 2023 / 5:27 PM IST

OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ OG. సాహూ ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ శరవేగంగా జరుగుతుంది. ఏప్రిల్ ఈ మూవీ షూటింగ్ ముంబైలో స్టార్ట్ అయ్యింది. అక్కడ పవన్ పై యాక్షన్ సీక్వెన్స్ తో పాటు హీరోయిన్ తో సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. ఆ తరువాత రెండు, మూడు షెడ్యూల్స్ ని హైదరాబాద్ లో కంప్లీట్ చేశారు. ఈ షెడ్యూల్స్ తరువాత పవన్ వారాహి యాత్ర మొదలు పెట్టడంతో షూటింగ్ కి కొంచెం బ్రేక్ పడింది.

Ashish Vidyarthi : రెండో భార్య‌తో హ‌నీమూన్‌లో ఆశిష్ విద్యార్థి..! ముస‌లోడే కానీ..

తాజాగా ఇప్పుడు నాలుగు షెడ్యూల్ గురించి దర్శకుడు సుజిత్ అప్డేట్ ఇచ్చాడు. త్వరలోనే హైదరాబాద్ లో ప్రధాన పాత్రలతో నాలుగో షెడ్యూల్ మొదలు కాబోతుంది అంటూ తెలియజేశాడు. ఈ షెడ్యూల్ లో ఎమోషనల్ డ్రామాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే పవన్ ఈ షెడ్యూల్ లో ఎప్పుడు పాల్గొంటాడు అనేదాని పై క్లారిటీ లేదు. పవన్ రెండో విడత వారాహి యాత్ర కూడా మొదలు పెట్టాడు. గతంలో చిత్ర నిర్మాతలు పవన్ ఎక్కడ ఉంటే అక్కడే షూటింగ్స్ జరుపుతాం అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.

Bholaa Shankar : భోళా శంకర్ పార్టీ సాంగ్ వచ్చేసింది.. ‘జాం జాం జజ్జనక’ అంటూ పాట అదిరిపోయింది..

ఈ క్రమంలోనే OG నాలుగో షెడ్యూల్ ని ఆంధ్రప్రదేశ్ లో ప్లాన్ చేస్తారా అనేది తెలియాలి. కాగా ఈ సినిమాలో పవన్ కి జోడిగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తుంది. తమిళ్ స్టార్ యాక్టర్స్ అర్జున్ దాస్ (Arjun Das), శ్రియారెడ్డి (Sriya Reddy) తో పాటు బాలీవుడ్ రొమాంటిక్ స్టార్ ఇమ్రాన్ హష్మి (Emraan Hashmi) విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.