Tamannaah Odela 2 Teaser out now
సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఓదెల 2 మూవీ ఒకటి. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని అకోశ్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా టైమ్‌లో ఓదెల రైల్వేస్టేషన్ మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఓదెల 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మహాకుంభ మేళాలో విడుదల చేశారు. టీజర్‌లో తమన్నా లేడీ అఘోరాగా కనిపించింది. మొత్తంగా టీజర్ ఆకట్టుకుంది.
Akira Nandhan : త్రివిక్రమ్ కొడుకు దర్శకత్వంలో పవన్ తనయుడి ఎంట్రీ..!
వశిష్ట సింహా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా కాపాడారు? అన్నదే ఈ చిత్రం కథాంశంగా తెలుస్తోంది.