Akira Nandhan : త్రివిక్రమ్ కొడుకు దర్శకత్వంలో పవన్ తనయుడి ఎంట్రీ..!
అకీరానందన్ అరంగేట్రంపై ఆసక్తి కొనసాగుతోంది. మరోవైపు త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ సినీ ఎంట్రీపై కూడా ఎన్నో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

Gossip Garage Akira Nandhan first movie director is Trivikram Son
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ ఇద్దరు కాంబినేషన్‌లో వచ్చిన మూవీ హిట్ అయినా.. ఫర్వాలేదనిపించినా..ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందరు. ప్రాణమిత్రుల కాంబోలో మూవీ వస్తే పండుగ చేసుకుంటుంటారు ఫ్యాన్స్.
అయితే పవన్ పాలిటిక్స్‌లో బిజీ అయిపోవడంతో కొన్నాళ్లుగా అతని వారసుడు అకీరానందన్ అరంగేట్రంపై ఆసక్తి కొనసాగుతోంది. మరోవైపు త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ సినీ ఎంట్రీపై కూడా ఎన్నో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు మరోసారి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.
Raa Raja : ‘రా రాజా’ రిలీజ్ డేట్ అనౌన్స్.. నటీనటుల ముఖాలు చూపించకుండా సరికొత్త హారర్ సినిమా..
పవన్ కల్యాణ్ వారసుడు అకిరా సినీ ఎంట్రీకి ఇంకో రెండేళ్ల టైమ్ పట్టొచ్చని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. అయితే అకిరానందన్ తన ఫస్ట్ సినిమాలో చాలా వైల్డ్ లుక్‌లో కనిపించబోతున్నాడట. స్టోరీ పవన్ ఇచ్చే అవకాశాలు ఉంటే..ఆ మూవీని త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ డైరెక్టర్ చేయబోతున్నాడంటున్నారు.
ఇప్పటికే త్రివిక్రమ్ దగ్గర కొంత వర్క్ నేర్చుకున్న రిషి మనోజ్..మరో వైల్డ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దగ్గర మరింత రాటు దేలబోతున్నాడట. ప్రభాస్ స్పిరిట్ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేయబోతున్నాడట రిషి మనోజ్. త్రివిక్రమే..సందీప్‌రెడ్డి వంగా దగ్గర ట్రైనింగ్ తీసుకొమ్మని రిషి మనోజ్‌కు రికమెండ్ చేశాడంటున్నారు. దాంతో అకిరానందన్..రిషి మనోజ్ కాంబినేషన్ లో వచ్చే సినిమా సందీప్ రెడ్డి వంగా సినిమాలాగా..ఫుల్ వైల్డ్ మూవీగా ఉండబోతుందన్న టాక్ నడుస్తోంది. హీరో, డైరెక్టర్ వారసుల కాంబోలో వచ్చే సినిమాల ఎలా ఉండబోతుందో చూడాలి మరి.