Tamannaah Responds On Rumours Of Dating Vijay Verma
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని, బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించింది. అయితే ఇటీవల బాలీవుడ్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టిన తమన్నా, ‘బబ్లీ బౌన్సర్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాగా, ఈ సినిమా యావరేజ్ మూవీగా నిలిచింది. అయితే ఇటీవల బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా డేటింగ్ చేస్తుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది.
Tamannaah love story : తమన్నా, విజయ్ వర్మ లవ్ స్టోరీ నిజమేనా?? విజయ్ వర్మ తమన్నాని ఇలా పిలుస్తాడా?
పలు సందర్భాల్లో ఈ జోడీ మీడియా కంటికి చిక్కడంతో ఈ వార్తలు మరింత జోరందుకున్నాయి. అయితే న్యూ ఇయర్ వేడుకలో ఈ జోడీ లిప్ కిస్ చేస్తున్న ఓ వీడియో అప్పట్లో నెట్టింట బాగా వైరల్ అయ్యింది. దీంతో వీరిమధ్య ఏదో విషయం నడుస్తుందని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. కానీ, ఈ వార్తలపై అటు తమన్నా, ఇటు విజయ్ వర్మ ఎవరూ రెస్పాండ్ కాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా, తన పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడింది. ఈ క్రమంలోనే విజయ్ వర్మతో డేటింగ్ విషయంపై ఆమె స్పందించింది.
ఇలాంటి వార్తలు అసలు ఎలా వస్తాయో తనకు తెలీదంటూ ఈ డేటింగ్ రూమర్‌పై కామెంట్ చేసింది. తామిద్దరం ఓ సినిమా కోసం కలిసి నటించామని తమన్నా చెప్పుకొచ్చింది. ఇక ఆ తరువాత విజయ్ వర్మ గురించి ఎలాంటి విషయాలను మాట్లాడలేదు. దీంతో అసలు విజయ్ వర్మతో తమన్నా డేటింగ్ చేస్తుందనే విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే మళ్లీ కన్ఫ్యూజ్ చేసింది. ఏదేమైనా తమన్నా డేటింగ్ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.