Tamannaah love story : తమన్నా, విజయ్ వర్మ లవ్ స్టోరీ నిజమేనా?? విజయ్ వర్మ తమన్నాని ఇలా పిలుస్తాడా?

తమన్నా, విజయ్ వర్మ ఇటీవల కలిసి పలు సార్లు మీడియాకి కనపడ్డారు. గోవాలో జారిగిన ఓ పార్టీలో వీరిద్దరూ ముద్దు కూడా పెట్టుకున్నారని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. వీటిపై వీళ్ళిద్దరూ స్పందించలేదు. కానీ ఇది ప్రేమ జంటే అంటోంది బాలీవుడ్. తాజాగా విజయ్ వర్మ..................

Tamannaah love story : తమన్నా, విజయ్ వర్మ లవ్ స్టోరీ నిజమేనా?? విజయ్ వర్మ తమన్నాని ఇలా పిలుస్తాడా?

Tamannaah vijay varma love story trending again and do you know what nick name vijay varma calling tamannaah

Updated On : February 25, 2023 / 7:11 AM IST

Tamannaah love story :  సినీ పరిశ్రమలో సెలబ్రిటీలు చాలా మంది లవ్ లో ఉన్నా, ఎవరితో అయినా డేటింగ్ చేస్తున్నా అంత తొందరగా బయటకు చెప్పరు. ఇక వాళ్లపై గాసిప్స్ బాగానే వస్తాయి. హీరో, హీరోయిన్స్ ఎవరితోనైనా క్లోజ్ గా కనిపిస్తే చాలు వాళ్ళపై రూమర్స్ వచ్చేస్తాయి. కొంతమంది ఆ రూమర్స్ ని పట్టించుకోరు, కొంతమంది ఆ రూమర్స్ మీద సీరియస్ గానే రియాక్ట్ అవుతారు. ఒక్కోసారి ఆ రూమర్స్ కూడా నిజం అయ్యే ఛాన్సులు కూడా ఉండొచ్చు. గత కొన్ని రోజులుగా స్టార్ హీరోయిన్ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి.

తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ళు అవుతున్నా ఇంకా తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమలలో వరుస అవకాశాలు సాధిస్తుంది. ఇక 33 ఏళ్ళు వచ్చినా పెళ్లి టాపిక్ ఎత్తట్లేదు. ఇప్పటివరకు తమన్నా మీద గాసిప్స్ ఎక్కువగా రాలేదు. కానీ గత కొన్ని రోజులుగా తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉందని, డేటింగ్ చేస్తున్నారని వార్తలు తెగ వస్తున్నాయి.

Jabardasth Rakesh – Jordar Sujatha :జబర్దస్త్ జంట రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత పెళ్లి ఫోటోలు..

తమన్నా, విజయ్ వర్మ ఇటీవల కలిసి పలు సార్లు మీడియాకి కనపడ్డారు. గోవాలో జారిగిన ఓ పార్టీలో వీరిద్దరూ ముద్దు కూడా పెట్టుకున్నారని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. వీటిపై వీళ్ళిద్దరూ స్పందించలేదు. కానీ ఇది ప్రేమ జంటే అంటోంది బాలీవుడ్. తాజాగా విజయ్ వర్మ, సోనాక్షి సిన్హా కలిసి నటించిన దాహద్ సినిమా బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. విజయ్ వర్మ అక్కడ ఫిలిం ఫెస్టివల్ లోని కొన్ని ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేయగా వాటిని తమన్నా తన స్టోరీలో షేర్ చేస్తూ కంగ్రాట్యులేషన్స్ దాహద్ టీం అంటూ అక్కడ ఉన్న వాళ్ళని ట్యాగ్ చేసింది. దీనిని విజయ్ వర్మ మళ్ళీ తన స్టోరీలో షేర్ చేస్తూ థ్యాంక్యూ తమాటర్ అని పోస్ట్ చేశాడు. పక్కనే ఓ టమాటా, ఓ ఫ్లవర్ సింబల్ ఉంచాడు. దీంతో విజయ్ వర్మ తమన్నాని తమాటర్ అని పిలుస్తాడా? అంటే దాని అర్ధం ఏంటి అని అభిమానులు, నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు. మొత్తానికి మరోసారి తమన్నా-విజయ్ వర్మల ప్రేమ కథ చర్చగా మారింది.