Divyabharathi
Divyabharathi : బ్యాచిలర్ సినిమాతో తమిళ భామ దివ్యభారతి ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తుంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రెగ్యులర్ గా వైరల్ అవుతుంది. త్వరలో సుడిగాలి సుధీర్ సరసన గోట్ సినిమాతో దివ్యభారతి తెలుగులోకి రానుంది.(Divyabharathi)
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో బాలయ్య గురించి ఆసక్తికర సంఘటన తెలిపింది.
దివ్యభారతి మాట్లాడుతూ.. తెలుగులో బాలయ్య సర్ అంటే ఇష్టం. బాలయ్య గారికి ఒక పవర్ ఉంటుంది. ఒక ఆరా ఉంటుంది. ఆయన స్టైల్ ఆయనకు ఉంటుంది. ఆయన సినిమాల్లో సమరసింహా రెడ్డి నాకు ఇష్టం. నేను ఈ మూవీలో పనిచేసేటప్పుడు ఇందులో చేసిన ఒక యాక్టర్ బాలయ్య కు క్లోజ్ అని చెప్పి కాల్ చేసి నాకు మాట్లాడమని ఇచ్చారు. నేను అబద్దమేమో అనుకున్నా. అది ప్రాంక్ అనుకున్నా.
కాల్ లో బాలయ్య గారు స్వీట్ గా తమిళ్ లో మాట్లాడారు. తెలుగులో మొదటి సినిమా కదా అల్ ది బెస్ట్ చెప్పారు. బాగా చేయండి అని చెప్పారు. ఆయన చాలా బాగా మాట్లాడారు నాతో. చెన్నై సంగతులు చెప్పారు. కాల్ అయిపోయాక కూడా నేను ఇది ప్రాంక్ అనుకున్నాను. చాలాసేపు నమ్మలేదు. బాలయ్యకి కాల్ చేసిచ్చిన యాక్టర్ ఆయనకు క్లోజ్ అని వేరేవాళ్లు చెప్పడంతో అప్పుడు నమ్మాను. కానీ ఇప్పటికి కూడా ఇది నిజమేనా ప్రాంక్ అనుకుంట అని అనిపిస్తుంది. డైరెక్ట్ గా బాలయ్యని కలవలేదు అని తెలిపింది.
Also Read : Divyabharathi : ప్రొఫెసర్ తో లవ్ స్టోరీ.. హీరోయిన్ అయ్యాక.. తన ప్రేమ కథ చెప్పిన దివ్యభారతి..