Divyabharathi : ప్రొఫెసర్ తో లవ్ స్టోరీ.. హీరోయిన్ అయ్యాక.. తన ప్రేమ కథ చెప్పిన దివ్యభారతి..
ఈ క్రమంలో దివ్యభారతి తన ప్రేమకథ కూడా చెప్పింది. (Divyabharathi)
Divyabharathi
Divyabharathi : తమిళ భామ దివ్యభారతి బ్యాచిలర్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రెగ్యులర్ గా వైరల్ అవుతుంది. ప్రస్తుతం దివ్యభారతి తమిళ్ సినిమాలతో బిజీగా ఉండగా తెలుగులో త్వరలో సుడిగాలి సుధీర్ సరసన గోట్ సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.(Divyabharathi)
ఈ క్రమంలో దివ్యభారతి తన ప్రేమకథ కూడా చెప్పింది.
Also Read : Sobhita Dhulipala : ఫస్ట్ సంక్రాంతి మా ఇంట్లో.. చైతన్యతో పెళ్లి తర్వాత ఆసక్తికర విషయాలు చెప్పిన శోభిత..
దివ్యభారతి మాట్లాడుతూ.. నేను డిప్లమోలో ఐటి చదివాను. అప్పుడు నాకు కొంతమంది ప్రపోజ్ చేశారు. ఒక అబ్బాయి నన్ను బాగా ఫాలో అయ్యాడు. వర్క్ షాప్ లో ఆ అబ్బాయి హెల్ప్ తీసుకున్నాను నేను. అతను ప్రపోజ్ చేసినా నో చెప్పాను. ఇంజనీరింగ్ లో కూడా అబ్బాయిలతో మాట్లాడేదాన్ని కాదు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. కానీ ఆయన ప్రొఫెసర్ అని తర్వాత తెలిసింది. ఆయన వేరే బ్రాంచ్ ప్రొఫెసర్. నేను కాలేజీలో ఏ అబ్బాయిని పట్టించుకోలేదు. చూసిన ఒక్కరు ప్రొఫెసర్ అయ్యారు. ఒకరోజు నేను అతన్ని చూస్తుంటే అతను కూడా నన్ను చూసాడు.
ఆ తర్వాత నా ఫ్రెండ్ వచ్చి మా సర్ నీ నెంబర్ అడిగారు ఇచ్చాను అని చెపింది. అప్పుడు అతనే సర్ అని తెలీదు. ఎందుకు ఇచ్చావు అని కోప్పడ్డాను. ఆయన రాత్రి కాల్ చేసి నువ్వు ఒక అబ్బాయిని చూసావు కదా అని అడిగారు. దాంతో నేను భయపడి అయ్యో నేను ఏ తప్పు చేయలేదు, చూడలేదు అని అన్నాను. ఆయన అది కాదు చూసింది నన్నే అని చెప్తే షాక్ అయి సారీ చెప్పాను. ఆ సర్ చాలా మంచివాళ్ళు. స్టూడెంట్స్ కి హెల్ప్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు. తర్వాత రెగ్యులర్ గా మాట్లాడుకొని ఒకర్నొకరు ఇష్టపడ్డాం. ఎవర్ని పట్టించుకోని సర్ నాతో ఉన్నారు అని ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ తర్వాత మా అమ్మకు ఈ విషయం తెలిసి లైఫ్ గురించి చెప్పింది. దాంతో కాలేజీ అయ్యాక అది అక్కడతో బ్రేక్ అయింది. అది లవ్ కాదు అని తర్వాత అర్థముంది. అందుకే ఎక్కువ బాధపడలేదు. నా మొదటి సినిమా రిలీజ్ అయ్యాక మెసేజ్ చేసారు మీరు లైఫ్ లో ఇలా ఎదగడం ఆనందంగా ఉంది అంటూ కంగ్రాట్స్ చెప్పారు అని తెలిపింది.
Also Read : Mrunal Thakur : వావ్.. మృణాల్ ఠాకూర్ మెరుపులు.. ఎంత క్యూట్ గా ఉందో..
