Sobhita Dhulipala : ఫస్ట్ సంక్రాంతి మా ఇంట్లో.. చైతన్యతో పెళ్లి తర్వాత ఆసక్తికర విషయాలు చెప్పిన శోభిత..

ఓ ఇంటర్వ్యూలో శోభిత నాగచైతన్య గురించి, సంక్రాంతి గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది. (Sobhita Dhulipala)

Sobhita Dhulipala : ఫస్ట్ సంక్రాంతి మా ఇంట్లో.. చైతన్యతో పెళ్లి తర్వాత ఆసక్తికర విషయాలు చెప్పిన శోభిత..

Sobhita Dhulipala

Updated On : January 23, 2026 / 10:02 AM IST

Sobhita Dhulipala : హీరోయిన్ శోభిత ధూళిపాళ 2024 డిసెంబర్ లో నాగచైతన్యని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్నుంచి శోభిత రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తుంది. శోభిత చాన్నాళ్ల తర్వాత చీకటిలో అనే తెలుగు సినిమా చేసింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నేడు జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శోభిత పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది.(Sobhita Dhulipala)

ఓ ఇంటర్వ్యూలో శోభిత నాగచైతన్య గురించి, సంక్రాంతి గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది.

Also See : Mrunal Thakur : వావ్.. మృణాల్ ఠాకూర్ మెరుపులు.. ఎంత క్యూట్ గా ఉందో..

శోభిత ధూళిపాళ మాట్లాడుతూ.. నాకు భోగి పండగ ఇష్టం. అవన్నీ కలెక్ట్ చేసి ఉదయాన్నే మంట వేయడం అందరితో బాగుంటుంది. నేను ముంబై వెళ్లినా ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ మా వైజాగ్ లో భోగి గ్రాండ్ గా చేసుకునేదాన్ని. ఈ సారి మాత్రం ఇక్కడ అక్కినేని ఇంట్లో చేసాము. మా పేరెంట్స్ ఇక్కడికే వచ్చారు. మొదటి సంక్రాంతికి మేము వైజాగ్ వెళ్ళాము అని తెలిపింది.

అలాగే.. నేను, నాగచైతన్య వేరే సినిమాల గురించి మాట్లాడుకుంటాం, ఆడియన్స్ గురించి మాట్లాడుకుంటాం. మా సినిమాల గురించి మేము ఎక్కువగా మాట్లాడం. అప్పుడప్పుడు చైతన్య దగ్గర్నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాను అంతే కానీ డెషిషన్స్ తీసుకోను. మొదట్నుంచి నాకు నచ్చింది నేను చేసుకుంటూ వస్తున్నాను అని తెలిపింది.

Also Read : Cheekatilo Review : శోభిత ధూళిపాళ ‘చీకటిలో’ మూవీ రివ్యూ.. పెళ్లి తర్వాత శోభిత ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే..