Actress Sindhu : విషాదం.. దీనస్థితిలో కన్నుమూసిన నటి.. వైద్యానికి డబ్బుల్లేక..!
ఎన్నో ఏళ్లుగా పరిశ్రమలో ఉంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా పని చేస్తున్న వాళ్లల్లో కొందరు ఎంతో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి ఓ నటి అనారోగ్యం బారిన పడింది. వైద్యానికి సరిపడా డబ్బులు లేక ప్రాణాలు కోల్పోయింది.

Actress Sindhu
Actress Sindhu dies : సినీ ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం. ఇక్కడ ఎంతో ఎత్తుకు ఎదిగిన వాళ్లు ఉన్నారు. అధఃపాతాళానికి పడిపోయిన వాళ్లు ఉన్నారు. గ్లామర్ ఫీల్డ్ అనగానే డబ్బులకు లోటు ఉండదు అనేది చాలా మంది భావన. అయితే.. అందరూ కోటిశ్వరులు అవ్వరు. ఎన్నో ఏళ్లుగా పరిశ్రమలో ఉంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా పని చేస్తున్న వాళ్లల్లో కొందరు ఎంతో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి ఓ నటి అనారోగ్యం బారిన పడింది. వైద్యానికి సరిపడా డబ్బులు లేక ప్రాణాలు కోల్పోయింది.
ఆమె మరోవరో కాదు.. తమిళ సినిమా ‘అంగడి తెరు’ (Angadi Theru) (తెలుగులో ‘షాపింగ్ మాల్’) చిత్రంలో నటించిన సింధు(Sindhu). ఆమె వయస్సు 42సంవత్సరాలు. 2020లో ఆమె రొమ్ము క్యాన్సర్(Breast Cancer) బారిన పడింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అప్పటి నుంచి ఆమె ఇంటి వద్దనే ఉంటూ చికిత్స తీసుకుంటుంది. కొద్ది రోజుల క్రితం ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆమెను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.
Vijay Raghavendra : గుండెపోటుతో ప్రముఖ నటుడి భార్య మృతి.. 19 రోజుల్లో వివాహ వార్షికోత్సవం
అయితే.. నగదు లేకపోవడంతో మెరుగైన వైద్యం పొందలేకపోయింది. ఈ క్రమంలో ఈరోజు (సోమవారం) ఉదయం 2.15 గంటల సమయంలో తుదిశ్వాస విడిచింది. సింధు ఇక లేదు అనే విషయాన్ని తమిళ హాస్య నటుడు కొట్టాచి సోషల్ మీడియాలో తెలియజేశారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ నటులు సంతాపం తెలియజేస్తున్నారు.

Actress Sindhu
14 ఏళ్ల వయసులోనే సింధుకు వివాహమైంది. ఏడాదికే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆమెకు ‘అంగడి తెరు’ చిత్రం మంచి గుర్తింపు తెచ్చింది. పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. మెరుగైన చికిత్స అందిఉంటే ఆమె ప్రాణాలతో ఉండేదని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’ వాయిదా..? దర్శకుడు నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే..?
View this post on Instagram