నా పిల్లలకు కాబోయే తల్లి నయనతార : విఘ్నేష్ శివన్

  • Publish Date - May 11, 2020 / 03:03 PM IST

మాతృదినోత్సవం సందర్భంగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తన ప్రియురాలైన లేడీ సూపర్ స్టార్ నయనతారకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘నా పిల్లలకు కాబోయే తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు’ అని చెప్పారు. విఘ్నేష్ మాటలు అందరినీ ఆకర్షించాయి. నయనతార తల్లి డయనా కురియన్ కు కూడా శుభాకాంక్షలు తెలిపారు.  

నయనతార ఓ బాబును ఎత్తుకుని ఉన్న చక్కటి ఫొటోను ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేశారు. నయనతార ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో విఘ్నేష్ శివన్, నయనతార పెళ్లి జరుగనున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అందమైన అమ్మాయికి జన్మనిచ్చారని కొనియాడారు. నయనతార తన తల్లితో దిగిన ఫొటోలను షేర్ చేశారు. త్వరలోనే విఘ్నేష్, నయనతార పెళ్లి జరుగనున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

2015 సంవత్సరంలో నేనూ రౌడీనే చిత్రంతో విఘ్నేష్ శివన్, నయనతారకు పరిచయం ఏర్పడింది. ఈ సినిమాకు విఘ్నేష్ డైరెక్షన్ చేయగా, హీరోయిన్ గా నయనతార నటించారు. వీరిద్దరు కలిసి అనేకసార్లు విహారయాత్రలకు వెళ్లారు. నయనతార ఇటీవల బిగిల్ దర్బార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విఘ్నేష్, నయనతార కాంబినేషన్ లో నెట్రికన్ అనే థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది.