మక్కాలోనే కన్నుమూసిన రాజ్‌ కపూర్ కొడుకు

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు రాజ్ కపూర్ కొడుకు షారుఖ్ కపూర్ మక్కాలో కన్నుమూశాడు..

  • Published By: sekhar ,Published On : February 19, 2020 / 05:05 AM IST
మక్కాలోనే కన్నుమూసిన రాజ్‌ కపూర్ కొడుకు

Updated On : February 19, 2020 / 5:05 AM IST

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు రాజ్ కపూర్ కొడుకు షారుఖ్ కపూర్ మక్కాలో కన్నుమూశాడు..

కోలీవుడ్ సీనియర్‌ దర్శకుడు, నటుడు రాజ్‌కపూర్‌ కుమారుడు షారూఖ్‌ కపూర్‌ (23) అనారోగ్యంతో సోమవారం మక్కాలో మృతి చెందాడు. ఆయన కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ‘తాలాట్టు కేట్కు దమ్మా’, ‘అవన్‌ వరువాళా’, ‘ఆనంద పూంగాట్రు’ తదితర చిత్రాల దర్శకుడు రాజ్‌కపూర్‌.

ఈయనకు భార్య సజీలా కపూర్, కుమారుడు షారూఖ్‌ కపూర్, కుమార్తెలు షమీమా, షానియా ఉన్నారు. కొడుకు షారూఖ్‌ కపుర్‌ సోమవారం మక్కాలో అనూహ్యంగా మృతి చెందాడు. ఇతను కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. అతని ఆరోగ్యం బాగుపడితే  మక్కాకు వస్తామని అతని తల్లి మొక్కుకున్నారట.

షారూక్‌ కపూర్‌కు ఆరోగ్యం బాగుపడడంతో రాజ్‌కపూర్‌ భార్య కొడుకును తీసుకుని మక్కాకు వెళ్లారు. అక్కడ వాతావరణం అతి శీతలంగా ఉండడంతో షారూఖ్‌ కపూర్‌ ఇంతకు ముందే శ్వాసకోశ సంబంధిత సమస్య ఉండడంతో అనారోగ్యానికి గురయ్యాడు. వాతావరణ ప్రభావం ఏమో అని అతని తల్లి అనుకున్నారు.

దీంతో షారూఖ్‌ కపూర్‌ శ్వాసకోశ సమస్య కారణంగా అనూహ్యంగా సోమవారం మక్కాలోనే కన్ను మూశాడు. ఊహించని ఆ పరిణామంతో దర్శకుడు రాజ్‌కపూర్‌ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనతో సినీ పరిశ్రమ షాక్‌కి గురైంది.

Tamil filmmaker Raj Kapoor's son Sharook Kapoor passes away aged 23 in Mecca

Tamil filmmaker Raj Kapoor's son Sharook Kapoor passes away aged 23 in Mecca

చదువు పూర్తి కాగానే నటనలో శిక్షణ ఇప్పించాలని తండ్రి రాజ్‌కపూర్‌ భావించారట. అయితే చిన్న వయసులోనే షారూఖ్ కపూర్‌ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది.

Read More>>స్వదేశీ ‘కావేరి అమ్మ’ కన్నుమూత