Tamil hero Sivakarthikeyan makes shocking comments about his fans
Sivakarthikeyan: తమిళ స్టార్ శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. యాంకర్ గా బుల్లితెరలో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈ నటుడు ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు. ఒక నిర్ణయం తీసుకొని, దాని కోసం అహర్నిశలు కష్టపడితే ఏదైనా సాదించవచ్చు అని ప్రూవ్ చేసి కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు ఈ హీరో. అందుకే, భాషతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు శివ కార్తికేయన్(Sivakarthikeyan) ని ఇష్టపడతారు. ఇదిలా ఉంటే, తాజాగా ఈ హీరో ఫ్యాన్లీ ఎంటర్టైన్మెంట్ అనే యాప్ ఓపెనింగ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో ఆయన తన ఫ్యాన్స్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. “నన్ను దేవుడు చూసే అభిమానులు నాకు అవసరం లేరు. మీ తల్లిదండ్రులను, దేవుడిని పూజిస్తూ, ప్రేమగా మాట్లాడితే నాకు అదే చాలు. నేను ప్రతీ ఒక్కరికి ఒక సోదరుడిగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతాను. అందుకే ఫ్యాన్స్ ని ఎప్పుడు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అని పలకరిస్తూ ఉంటాను. అదే నాకు నచ్చుతుంది. ప్రస్తుతం ప్రపంచం చాలా నెగిటీవ్ గా మారింది. సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటే చాలా భయంగా ఉంది. మనం ఎప్పుడు తప్పు చేస్తామా అని ఎదురుచూస్తూ ఉంటారు. అందుకే సోషల్ మీడియా వైపు వెళ్లడం మానేశాను”అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే, ఇటీవలే మదరాశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివ కార్తికేయన్ ప్రస్తుతం పరాశక్తి అనే సినిమా చేస్తున్నాడు. లేడీ డైరెక్టర్ సుధ కొంగర తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా ఈ సినిమా జయం రవి, అధర్వ మురళి ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2026 జనవరి 14న విడుదల కానుంది. మరి చాలా కాలంగా హిట్ కోసం చూస్తున్న శివ కార్తికేయన్ కి ఈ సినిమాతో హిట్ పడుతుందా చూడాలి.
#Sivakarthikeyan Latest Speech: “I don’t want my fans to worship me.. They should only worship God and their parents.. I wish to have very friendly and brotherly fans.. pic.twitter.com/7ZczXFrWGv
— srk (@srk9484) December 3, 2025