Siva Karthikeyan – Vijay Antony : ఇదెక్కడి కో ఇన్సిడెన్స్.. ఇద్దరు స్టార్ హీరోలు.. ఇద్దరికీ 25వ సినిమా.. ఒకే రోజు ఒకే టైటిల్ తో సినిమా అనౌన్స్..
ఇద్దరు స్టార్ హీరోలు ఒకే రోజు ఒకే టైటిల్ తో అనౌన్స్ చేసారు. అది కూడా ఇద్దరికీ 25వ సినిమా కావడం విశేషం.

Tamil Heros Siva Karthikeyan and Vijay Antony Announced Their 25th Films with same title on same day
Siva Karthikeyan – Vijay Antony : సాధారణంగా ఒక సినిమా టైటిల్ అనౌన్స్ చేసే ముందు ఆ సినిమా పరిశ్రమ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించుకుంటారు. ఆ సినిమా రిలీజయిన కొన్నాళ్ల వరకు అదే టైటిల్ తో మళ్ళీ ఇంకో సినిమా రాకూడదు. రూల్స్ ప్రకారం కొన్ని సంవత్సరాల తర్వాత గతంలో ఉన్న టైటిల్ తో సినిమా అనౌన్స్ చేయొచ్చు. కానీ నేడు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
ఇద్దరు స్టార్ హీరోలు ఒకే రోజు ఒకే టైటిల్ తో అనౌన్స్ చేసారు. అది కూడా ఇద్దరికీ 25వ సినిమా కావడం విశేషం. తమిళ్ స్టార్ హీరోలు శివ కార్తికేయన్, విజయ్ ఆంటోనీలు నేడు తమ 25వ సినిమాని ప్రకటించారు. శివ కార్తికేయన్ 25వ సినిమా సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి అనే టైటిల్ తో ప్రకటించారు. అలాగే విజయ్ ఆంటోనీ 25వ సినిమా అరుణ్ ప్రభు దర్శకత్వంలో కూడా పరాశక్తి అనే టైటిల్ తో ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు, సినీ పరిశ్రమ వ్యక్తులు ఆశ్చర్యపోతున్నారు.
అయితే రెండు మూవీ టీమ్స్ కి తెలిసే ఇది చేసారా? లేక అనుకోకుండా ఒకే టైటిల్ అనౌన్స్ చేసారా? ఇద్దరూ టైటిల్స్ రిజిస్టర్ చేయిస్తే ఒకే టైటిల్ ఒకే సమయంలో ఇద్దరికీ ఎలా ఇచ్చారు? లేదా ఈ టైటిల్ మీద రెండు మూవీ టీమ్స్ కి ఏదైనా వివాదం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకే టైటిల్ అనౌన్స్ చేయడం కో ఇన్సిడెన్స్ అనుకున్నా ఇద్దరికీ ఇది 25వ సినిమానే కావడం ఇదెక్కడి కో ఇన్సిడెన్స్ రా బాబు అని ఆశ్చర్యపోతున్నారు.
ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. విజయ్ ఆంటోనీ అయితే తన సినిమాని సమ్మర్ కి రిలీజ్ చేస్తానని కూడా ప్రకటించాడు. శివ కార్తికేయన్ సినిమా అయితే రిలీజ్ ఎప్పుడో చెప్పలేదు. శివకార్తికేయన్ సినిమా పీరియాడిక్ యాక్షన్ అని తెలుస్తుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా హీరోలు జయం రవి, అధర్వ మురళి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇద్దరూ ప్రస్తుతం మంచి ఫామ్ లోనే ఉన్నారు. సాధారణంగా విజయ్ ఆంటోనీ చాలా ఫాస్ట్ గా సినిమాలు తీసి రిలీజ్ చేస్తూ ఉంటాడు. మరి ఈ రెండు సినిమాల్లో ఎవరిది ఫస్ట్ రిలీజ్ అవుతుంది? టైటిల్ పై రెండు మూవీ టీమ్స్ లో ఎవరైనా స్పందిస్తారా చూడాలి.
అయితే అప్పుడే కొంతమంది ఫ్యాన్స్ మా టైటిల్ మీరు కొట్టేసారు అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ మొదలుపెట్టేసారు. మొత్తానికి ఇద్దరు స్టార్ హీరోలు ఒకే రోజు ఒకే టైటిల్ తో ఇద్దరికీ 25వ సినిమాకి అనౌన్స్ చేయడంతో అందర్లోనూ ఆసక్తి నెలకొంది.