Santhosh Naryanan : వరుసగా తెలుగు సినిమాల ఆఫర్స్ పట్టేస్తున్న తమిళ మ్యూజిక్ డైరెక్టర్..

రెహమాన్, హారిస్ జైరాజ్ తర్వాత ఆ రేంజ్ టాలెంట్ తో తెలుగులోకి వస్తున్న మరో తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్. 12 ఏళ్ళ క్రితం కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఇతడు ఈ జనరేషన్ ఆడియన్స్ కి కావల్సిన ట్రెండింగ్ ఆల్బమ్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు సంతోష్ నారాయణన్ టాలీవుడ్ లోనూ సంగీత దర్శకుడిగా ఫుల్ బిజీ కాబోతున్నాడు.................

Santhosh Naryanan : వరుసగా తెలుగు సినిమాల ఆఫర్స్ పట్టేస్తున్న తమిళ మ్యూజిక్ డైరెక్టర్..

Tamil Music Director Santhosh Narayanan Getting continuous offers in Telugu

Updated On : February 28, 2023 / 11:02 AM IST

Santhosh Naryanan :  రెహమాన్, హారిస్ జైరాజ్ తర్వాత ఆ రేంజ్ టాలెంట్ తో తెలుగులోకి వస్తున్న మరో తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్. 12 ఏళ్ళ క్రితం కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఇతడు ఈ జనరేషన్ ఆడియన్స్ కి కావల్సిన ట్రెండింగ్ ఆల్బమ్స్ ఇస్తున్నాడు. ప్రజెంట్ టాలీవుడ్ లో ఇతడు కొన్ని క్రేజీ కాంబో మూవీస్ కు వర్క్ చేస్తున్నాడు. అట్టకత్తి, పిజ్జా, సూదుకవ్వుం, జిగర్తండ, కబాలి, కాలా లాంటి సూపర్ హిట్ తమిళ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు సంతోష్ నారాయణన్. క్యాచీ ట్యూన్స్ ఇవ్వడంతో పాటు సీన్ మూడ్ ను అద్భుతంగా క్యారీ చేసే ఓ రేంజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో తిరుగులేని టాలెంట్ సంతోష్ నారాయణన్ ది. ఎంట్రీ ఇచ్చి 12 ఏళ్ళయినప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్ గా అతడు ఎప్పుడూ ఫెయిల్ అవలేదు. ప్రస్తుతం తమిళ్ లో జిగర్తండా సీక్వెల్ కు, అజిత్ నెక్స్ట్ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇప్పుడు సంతోష్ నారాయణన్ టాలీవుడ్ లోనూ సంగీత దర్శకుడిగా ఫుల్ బిజీ కాబోతున్నాడు. న్యాచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమా కోసం ఏరికోరి సంతోష్ నారాయణన్ తీసుకున్నారు మేకర్స్. ఆ తరహా రా అండ్ రస్టిక్ మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలంటే సంతోషే బెటర్ ఛాయిస్ అనుకుంటున్నారు. వెంకటేశ్ లెటెస్ట్ మూవీ ‘సైంధవ్’ కు కూడా సంతోష్ నారాయణన్ నే మ్యాజిక్ అందిస్తున్నాడు. శైలేష్ కొలను దీనికి డైరెక్టర్.

Akshay Kumar : అక్షయ్ కుమార్ కి ఏమైంది.. వరుస ఫ్లాప్స్.. ఓపెనింగ్స్ కూడా రావట్లేదు

అంతే కాకుండా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న మరో మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీ ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ముందుగా మిక్కీ జె మేయర్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రకటించారు మేకర్స్. ఇంత గ్రాండ్ స్కేల్ లో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీకి అతను న్యాయం చేయలేడు అనుకున్నారో ఏమో కానీ మొత్తానికి అతన్ని మార్చి సంతోష్ ని ఆ స్థానంలో తీసుకున్నారు. మరి వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్న ప్రాజెక్టు K సినిమాకి సంతోష్ ఏ రేంజ్ మ్యూజిక్ ఇస్తాడో అని ఎదురుచూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. దీంతో ఈ కోలీవుడ్ డైరెక్టర్ తెలుగులో వరుస సినిమాలు పట్టేస్తున్నాడు. ఇప్పుడు ఉన్న సినిమాలు రిలీజయి భారీ హిట్స్ కొడితే టాలీవుడ్ నుంచి ఈ ఆఫర్స్ ఇంకా పెరగొచ్చు.