Pawan Kalyan : OG షూట్ నుంచి స్పెషల్ ఫొటోలు వైరల్.. పవన్ కళ్యాణ్ తో తమిళ్ స్టార్ అర్జున్ దాస్..

తాజాగా తమిళ్ స్టార్ అర్జున్ దాస్ OG షూట్ లో పాల్గొనగా పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం OG మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. విజయవాడ దగ్గర్లో వేసిన ఓ సెట్ లో OG సినిమా షూట్ జరుగుతుంది. ఈ సినిమాపై భారీ హైప్ ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చాలా తమిళ్, బాలీవుడ్ స్టార్స్ చాలామందే ఉన్నారు.

తాజాగా తమిళ్ స్టార్ అర్జున్ దాస్ OG షూట్ లో పాల్గొనగా పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. పవన్ తో సరదాగా మాట్లాడి, సెల్ఫీలు కూడా తీసుకున్నాడు. ఈ ఫొటోలు షేర్ చేసి.. మీతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. మీతో పనిచేసిన ప్రతి రోజు ఎంజాయ్ చేసాం. మీ బిజీ షెడ్యూల్ లో కూడా షూట్ గ్యాప్ లో మమ్మల్ని కుర్చోబెట్టుకొని మాట్లాడినందుకు థ్యాంక్యూ. మన మాటలు ఎప్పటికి గుర్తుంటాయి. మీతో మళ్ళీ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. ఎప్పటికి రుణపడి ఉంటాను అని రాసుకొచ్చాడు అర్జున్ దాస్.

Also Read : Subhashree – Ajay Mysore : ఎంగేజ్మెంట్ చేసుకున్న నిర్మాత – బిగ్ బాస్ భామ.. ఇటీవలే కలిసి సాంగ్ షూట్.. అంతలోనే ప్రేమ, నిశ్చితార్థం..

ఇక ఈ ఫొటోల్లో పవన్ కళ్యాణ్ OG లుక్స్ లో బ్లాక్ డ్రెస్ లో అదుర్స్ అనిపించారు. పవన్ ఫుల్ గా నవ్వుతూ ఉన్నారు ఈ ఫొటోల్లో. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫోటోలను వైరల్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Also Read : Allu Arjun : అల్లు అర్జున్ – అట్లీ సినిమా మొదటి అప్డేట్ ఎప్పుడంటే.. ఫస్ట్ లుక్ లేదా టైటిల్..? ఫ్యాన్స్ గెట్ రెడీ..