Allu Arjun : అల్లు అర్జున్ – అట్లీ సినిమా మొదటి అప్డేట్ ఎప్పుడంటే.. ఫస్ట్ లుక్ లేదా టైటిల్..? ఫ్యాన్స్ గెట్ రెడీ..

తాజాగా ఈ సినిమా నుంచి ఓ అధికారిక ప్రకటన రిలీజ్ చేసారు.

Allu Arjun : అల్లు అర్జున్ – అట్లీ సినిమా మొదటి అప్డేట్ ఎప్పుడంటే.. ఫస్ట్ లుక్ లేదా టైటిల్..? ఫ్యాన్స్ గెట్ రెడీ..

Allu Arjun Atlee Movie First Update Announcing Details

Updated On : June 6, 2025 / 7:51 PM IST

Allu Arjun : ఇటీవల అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మాణంలో అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సినిమాని ప్రకటించారు. ఈ మేరకు అల్లు అర్జున్, అట్లీ హాలీవుడ్ వెళ్లి అక్కడ VFX నిపుణులతో మాట్లాడటం, అక్కడి VFX వర్క్స్ గురించి చూపించడంతో ఈ సినిమా భారీ స్థాయిలో ఉండబోతుందని అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉండనుందని టాలీవుడ్ టాక్.

Also Read : Akhil Akkineni Wedding : జైనబ్‌ రవ్జీతో అఖిల్ అక్కినేని పెళ్లి.. ఫొటోలు చూశారా..?

తాజాగా ఈ సినిమా నుంచి ఓ అధికారిక ప్రకటన రిలీజ్ చేసారు. రేపు జూన్ 7 ఉదయం 11 గంటలకు ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ రానుందని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో ఓ చెయ్యి కత్తిని పట్టుకొని ఉంది. ఇది అల్లు అర్జున్ చెయ్యి అని, సినిమా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ రివీల్ చేస్తారేమో అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పుష్ప 2 తర్వాత రాబోతున్న సినిమా మొదటి అప్డేట్ కావడంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

ఇక ఈ సినిమాకు దాదాపు 800 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని, అందులో గ్రాఫిక్స్ కే దాదాపు 150 కోట్ల వరకు పెడుతున్నారని, పాన్ వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తారని సమాచారం.