Subhashree – Ajay Mysore : ఎంగేజ్మెంట్ చేసుకున్న నిర్మాత – బిగ్ బాస్ భామ.. ఇటీవలే కలిసి సాంగ్ షూట్.. అంతలోనే ప్రేమ, నిశ్చితార్థం..

అజయ్ మైసూర్, శుభశ్రీ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

Subhashree – Ajay Mysore : ఎంగేజ్మెంట్ చేసుకున్న నిర్మాత – బిగ్ బాస్ భామ.. ఇటీవలే కలిసి సాంగ్ షూట్.. అంతలోనే ప్రేమ, నిశ్చితార్థం..

Bigg Boss Fame Subhashree Ajay Mysore Engagement Happened

Updated On : June 6, 2025 / 9:54 PM IST

Subhashree – Ajay Mysore : బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న శుభశ్రీ రాయగురు ప్రస్తుతం పలు మ్యూజిక్ వీడియోలు చేస్తుంది. ఇటీవల నటుడు, నిర్మాత అజయ్ మైసూర్ తో ఓ మ్యూజిక్ వీడియో చేసింది. ఈ క్రమంలో అజయ్ తో ప్రేమలో పడింది శుభశ్రీ. దీంతో ఈ ఇద్దరు తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు.

Also Read : Akkineni Family : అఖిల్ పెళ్లి.. ‘అక్కినేని ఫ్యామిలీ ఫొటో’ వైరల్.. ముగ్గురు దంపతులు..

అజయ్ మైసూర్, శుభశ్రీ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సాయికుమార్, సోహైల్, పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మెహందీ, సంగీత్, రిసెప్షన్ వేడుకలను కూడా నిర్వహించారు. జూలైలో అజయ్ మైసూర్, శుభశ్రీ వివాహం ఆస్ట్రేలియాలో జరగనుంది.

ajay mysore

ఇక ఈ నిశ్చితార్థ వేడుకలో అజయ్ మైసూర్, శుభశ్రీ కలిసి నటించిన మ్యూజిక్ వీడియో ‘మెజెస్టీ ఇన్ లవ్’ సాంగ్ ను లాంఛ్ చేశారు. సాయి కుమార్ వాయిస్ తో ఈ పాట ప్రారంభం కావడం గమనార్హం. మెజెస్టీ ఇన్ లవ్ సాంగ్ ను సిద్ధార్థ్ వాట్కిన్స్ స్వరపర్చి సింగర్ సాహితీ చాగంటితో కలిసి పాడారు. ఆ మ్యూజిక్ వీడియోని మీరు కూడా చూసేయండి..