Akkineni Family : అఖిల్ పెళ్లి.. ‘అక్కినేని ఫ్యామిలీ ఫొటో’ వైరల్.. ముగ్గురు దంపతులు..

తాజాగా అఖిల్ పెళ్లి నుంచి అక్కినేని ఫ్యామిలీ ఫోటోని విడుదల చేసారు.

Akkineni Family : అఖిల్ పెళ్లి.. ‘అక్కినేని ఫ్యామిలీ ఫొటో’ వైరల్.. ముగ్గురు దంపతులు..

Akkineni Family Photo goes Viral from Akhil Zainab Ravdjee Wedding

Updated On : June 6, 2025 / 9:40 PM IST

Akkineni Family : నాగార్జున రెండో తనయుడు, హీరో అక్కినేని అఖిల్ నేడు ఉదయం త‌న ప్రియురాలు జైనబ్‌ రవ్జీని వివాహం చేసుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని నాగార్జున ఇంట్లో నేడు జూన్ 6 తెల్ల‌వారుజామున 3 గంటలకు వీరి పెళ్లి జరిగింది. వీరి పెళ్ళికి పలువురు సినీ పరిశ్రమ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ క్రమంలో అఖిల్ – జైనబ్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read : Akhil Akkineni Wedding : జైనబ్‌ రవ్జీతో అఖిల్ అక్కినేని పెళ్లి.. ఫొటోలు చూశారా..?

తాజాగా అఖిల్ పెళ్లి నుంచి అక్కినేని ఫ్యామిలీ ఫోటోని విడుదల చేసారు. ఈ ఫొటోలో అక్కినేని నాగార్జున – అమల, అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ, కొత్త జంట అక్కినేని అఖిల్ – జైనబ్‌ రవ్జీ.. ఇలా ముగ్గురు అక్కినేని దంపతులు ఉన్నారు. అందరూ సాంప్రదాయ దుస్తుల్లో అలరించారు. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. ముగ్గురు హీరోలు భార్యలతో కలిసి దిగిన ఫొటో కావడంతో అక్కినేని అభిమానులు క్యూట్ ఫొటో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Akkineni Family Photo goes Viral from Akhil Zainab Ravdjee Wedding

ఈ ఫోటోని నాగచైతన్య తన సోషల్ మీడియాలో షేర్ చేసి అక్కినేని ఫ్యామిలీలోకి జైనబ్‌ కి స్వాగతం తెలిపాడు.