Vijay : రాజకీయాల్లోకి తమిళ హీరో విజయ్.. కొత్త పార్టీ ప్రకటన..

ఎన్నాళ్ళ నుంచో ఒక రూమర్ గా ఉన్న విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేడు నిజమైంది. రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ..

Tamil Star hero Thalapathy Vijay announce his political entry officially

Vijay : కోలీవుడ్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ విజయ్ మాత్రం వీటి పై స్పదించకుండా వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో కొన్నాళ్ల నుంచి విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై పెద్ద సస్పెన్స్ నెలకుంది. అయితే ఈమధ్య కాలంలో విజయ్.. సేవాకార్యక్రమాలతో ప్రజలకు చాలా దగ్గరగా ఉంటున్నారు. స్టూడెంట్స్ కి స్కాలర్‌షిప్ ఇవ్వడం, ఇటీవల వచ్చిన వరదలకు బాధ పడిన బాధితులకు సహాయం చేయడం కోసం.. విజయ్ స్వయంగా రావడం రాజకీయ రంగప్రవేశానికి సంకేతాలు సూచించాయి.

ఇప్పుడు విజయ్ తన రాజకీయ రంగప్రవేశం గురించి అధికారికంగా ప్రకటించారు. ‘విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్’ అనే స్వచ్ఛంద సంస్థ పేరుతో ఇన్నాళ్లు సంక్షేమ పథకాలు, సామాజిక సేవలు చేసిన విజయ్.. కేవలం స్వచ్ఛంద సంస్థతో పూర్తి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సంస్కరణల్లో మార్పు తీసుకురావడం అసాధ్యమని పేర్కొన్నారు. అందుకు రాజకీయ అధికారం కావాలని, అందుకే తాను రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు.

Also read : 92 ఏళ్ళ సినీ చరిత్రలో ‘హనుమాన్’ సరికొత్త సంచలనం..

“తమిళక వెట్రి కజగం” పేరుతో తన నేతృత్వంలో ఒక కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో పాలనాపరమైన దురాచారాలు, అవినీతి రాజకీయ సంస్కృతి, కులమత విభజన వంటి దురాచారాలు ఎక్కువయ్యిపోయాయని. తాను వాటికీ విరుద్ధంగా ప్రజలు కోరుకునే మౌలికమైన రాజకీయ మార్పుకు నాయకత్వం వహించడమే తన లక్ష్యం అంటూ విజయ్ చెప్పుకొచ్చారు.

2026 అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీకి దిగబోతున్నట్లు వెల్లడించారు. ఇక ఇన్నాళ్లు మాటల్లోనే ఉన్న ఈ పార్టీ ప్రకటన ఇప్పుడు నిజం కావడంతో.. తమిళనాటతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సంచనలంగా మారింది. కాగా తమిళనాట ఇప్పటికే చాలామంది సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి వచ్చి తమదైన ముద్ర వేశారు. మరి విజయ్ ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటారో చూడాలి.