Karthi Hospitalised : సర్దార్ 2 షూటింగ్ లో హీరో కార్తీకి గాయం.. డాక్టర్లు ఏం చెప్పారంటే..

ఈ ఘటనతో సర్దార్ 2 మూవీ షూటింగ్ ని నిలిపేశారు.

Karthi Hospitalised : తమిళ్ స్టార్ హీరో కార్తీ.. సర్దార్ 2 సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. ఆయన కాలికి గాయమైంది. మైసూరులో కీలకమైన యాక్షన్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే కార్తీని సమీపంలోని ఆసుపత్రికి తరలించింది చిత్ర యూనిట్. ఆసుపత్రిలో ఆయనకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.

కాగా, వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని కార్తీకి డాక్టర్లు సూచించారట. పూర్తిగా కోలుకోవడానికి వారం రోజుల సమయం పడుతుందని చెప్పారట.

Also Read : మేమిద్దరం చాలా క్లోజ్.. సౌందర్య పేరు వస్తే ఏడ్చేస్తా.. తను చనిపోయినప్పుడు నేను షూటింగ్ లో.. ఆమని కామెంట్స్..

ఈ ఘటనతో సర్దార్ 2 మూవీ షూటింగ్ ని నిలిపేశారు మేకర్స్. హీరో కార్తీ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే తిరిగి షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ నిర్ణయించారు. సర్దార్ 2 డైరెక్టర్ పీఎస్ మిత్రన్. రజిశా విజయన్, ఎస్ జే సూర్య, మాళవిక మోహనన్, అషికా రంగనాథ్ ఈ మూవీలో కీ రోల్ పోషిస్తున్నారు.