Aamani : మేమిద్దరం చాలా క్లోజ్.. సౌందర్య పేరు వస్తే ఏడ్చేస్తా.. తను చనిపోయినప్పుడు నేను షూటింగ్ లో.. ఆమని కామెంట్స్..
తాజాగా సౌందర్య క్లోజ్ ఫ్రెండ్ అయిన నటి ఆమని ఓ ఇంటర్వ్యూలో సౌందర్య గురించి మాట్లాడింది.

Aamani got Emotional While talking about Soundarya and says about their friendship
Aamani : అలనాటి అందాల తార సౌందర్య ఎన్నో సూపర్ హిట్, క్లాసిక్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అనుకోకుండా ఓ ప్రమాదంలో సౌందర్య మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణించినా ఇప్పటికి ఆమె సినిమాలు, ఆమె నటన గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇండస్ట్రీ గొప్ప నటీమణుల్లో సౌందర్య ఒకరు.
తాజాగా సౌందర్య క్లోజ్ ఫ్రెండ్ అయిన నటి ఆమని ఓ ఇంటర్వ్యూలో సౌందర్య గురించి మాట్లాడింది. ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసిన ఆమని ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తుంది. ఆమని నటించిన నారి సినిమా మార్చ్ 7న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమని మాట్లాడుతూ సౌందర్య గురించి గుర్తుచేసుకుంది.
ఆమని మాట్లాడుతూ.. నేను, సౌందర్య ఒకేసారి సినీ పరిశ్రమలోకి వచ్చాము. చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ తక్కువ. సినీ పరిశ్రమలో సౌందర్య నాకు క్లోజ్ అయింది. నేను సౌందర్య చాలా క్లోజ్. ఈ విషయం ఎవ్వరికి తెలియదు. తను చనిపోయినప్పుడు నేను స్వామి షూటింగ్ లో ఉన్నాను. అప్పుడే నేను సినిమాల్లో గ్యాప్ తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాను. షూటింగ్ లో ఉన్నప్పుడు సౌందర్య చనిపోయిన విషయం తెలిసి బాగా ఏడ్చేసాను. సెట్ లో కింద పడి ఏడ్చేసాను. తన బదులు నన్ను తీసుకెళ్లొచ్చు కదా అని ఏడ్చేసాను. డైట్ మెయింటైన్ అంటూ తక్కువ తినేది. చాలా సంపాదించింది కానీ అనుభవించలేదు. సౌందర్య పేరు వినిపిస్తేనే ఏడ్చేస్తాను. నేను ఫస్ట్ టైం సినిమాలు మానేద్దాం అనుకున్నప్పుడు కూడా సౌందర్య వద్దు అని చెప్పింది అంటూ ఎమోషనల్ అయింది.