NTR – Hrithik Roshan : ఇండియన్ బెస్ట్ డ్యాన్సర్స్.. ఎన్టీఆర్ – హృతిక్.. వార్ 2 కోసం స్పెషల్ సాంగ్ షూట్ మొదలు..
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా వార్ 2 తెరకెక్కుతుంది.

NTR Hrithik Roshan Dancing for a Mass Number in War 2 Shooting Happening in Mumbai
NTR – Hrithik Roshan : ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత నార్త్ లో కూడా మంచి ఫేమ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్ నుచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల దేవర సినిమాని కూడా హిందీలో రిలీజ్ చేయగా పర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో YRF స్పై యూనివర్స్ లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ సినిమాకు కొనసాగింపుగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా వార్ 2 తెరకెక్కుతుంది.
ఇప్పటికే వార్ 2 సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలిసి డ్యాన్స్ చేయబోతున్నారట. ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్లు అంటే అందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పేర్లు కూడా ఉంటాయి. టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ – బాలీవుడ్ నుంచి హృతిక్ కలిసి ఓ మాస్ సాంగ్ కి స్టెప్పులు వేస్తే అదిరిపోతుంది. వార్ 2 మేకర్స్ అదే ప్లాన్ చేస్తున్నారట.
ఆల్రెడీ ముంబైలో ఓ సెట్ లో హృతిక్ , ఎన్టీఆర్ మీద సాంగ్ షూట్ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వార్ 2 సినిమా 2025 ఇండిపెండ్స్ డేకి తీసుకు రాబోతున్నారు. మరి చెప్పిన సమయానికి వస్తుందా వాయిదా పడుతుందా చూడాలి. ఎన్టీఆర్ మొదటి బాలీవుడ్ సినిమా కావడంతో వార్ 2 పై ఇక్కడ కూడా అంచానాలు నెలకొన్నాయి. ఇక వార్ 2 తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఆల్రెడీ మొదలైంది.