Rajendra Prasad : డాడీ సినిమా షూటింగ్ కి అల్లు అర్జున్ ని తీసుకొచ్చి.. ఒంటి చేతి మీద డ్యాన్స్.. బన్నీ గురించి రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు..

చిరంజీవి డాడీ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. అప్పటికి అల్లు అర్జున్ హీరోగా ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు.

Rajendra Prasad : డాడీ సినిమా షూటింగ్ కి అల్లు అర్జున్ ని తీసుకొచ్చి.. ఒంటి చేతి మీద డ్యాన్స్.. బన్నీ గురించి రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు..

Rajendra Prasad Interesting Comments on Allu Arjun While Remembering Chiranjeevi Dady Movie Shoot

Updated On : March 4, 2025 / 1:40 PM IST

Rajendra Prasad : ఒకప్పుడు ఎన్నో కామెడీ సినిమాలతో నవ్వించిన సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికి కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కామెడీతో పాటు ఎమోషనల్ పాత్రల్లో వరుస సినిమాలతో మెప్పిస్తున్నారు. త్వరలో నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజేంద్ర ప్రసాద్ నేడు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర సంఘటనలు తెలిపారు.

చిరంజీవి డాడీ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. అప్పటికి అల్లు అర్జున్ హీరోగా ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. కానీ డాడీ సినిమాలో అల్లు అర్జున్ చిన్న డ్యాన్సర్ పాత్రలో కనిపించిన సంగతి మనకు తెలిసిందే. రాజేంద్ర ప్రసాద్ తాజాగా అల్లు అర్జున్ గురించి అప్పటి సంఘటనను గుర్తు చేసుకుంటూ మాట్లాడారు.

Also Read : Maharani : సూపర్ హిట్ సిరీస్ ‘మహారాణి’ మళ్ళీ వస్తుంది.. సీజన్ 4 టీజర్ రిలీజ్..

రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. డాడీ సినిమా షూట్ లో ఉన్నప్పుడు ఒకరోజు అల్లు అరవింద్ గారు వచ్చారు. నేను, చిరంజీవి మాట్లాడుకుంటుంటే ఎవరో అబ్బాయిని తీసుకొని వచ్చాడు. బావబామ్మర్దులు ఏదో మాట్లాడుకుంటారు అని నేను వెళ్ళిపోబోతుంటే అల్లు అరవింద్ మీరు కూడా ఉండండి అని చెప్పి తనతో పాటు వచ్చిన అబ్బాయిని వీడు మా రెండో వాడు అర్జున్ అని పరిచయం చేసాడు. వాడు డ్యాన్స్ వేస్తాడు ఒకసారి ఎలా ఉందో చూడండి అని చెప్పారు అరవింద్. నా ముందు, చిరంజీవి ముందు బన్నీ డ్యాన్స్ వేసాడు. సింగిల్ హ్యాండ్ తో భలే వేసాడు. నేను, చిరంజీవి బన్నీని ఆడిషన్ చేసాము. ఆ తర్వాత సినిమాలో ఆ పాత్రకు బన్నీని తీసుకున్నారు అని తెలిపాడు.

Also Read : Sankranthiki Vasthunam : దేవర రికార్డుని బద్దలు కొట్టిన ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇది మాములు సక్సెస్ కాదు..

అలాగే.. నాకు అల్లు అర్జున్ జులాయి సినిమా సెకండ్ ఇన్నింగ్స్ కి ఆరంభం లాంటింది. ఆ సినిమాలో బన్నీ నాతో చాలా క్లోజ్ గా ఉన్నాడు. అప్పుడు గురువు గారు గురువు గారు అని పిలిచేవాడు. నా దగ్గర యాక్టింగ్, సినిమా గురించి చాలా సలహాలు తీసుకునేవాడు అని తెలిపారు రాజేంద్ర ప్రసాద్.