Maharani : సూపర్ హిట్ సిరీస్ ‘మహారాణి’ మళ్ళీ వస్తుంది.. సీజన్ 4 టీజర్ రిలీజ్..

త్వరలో మహారాణి సిరీస్ సీజన్ 4 సోనీ లివ్ లో ప్రసారం కానుంది.

Maharani : సూపర్ హిట్ సిరీస్ ‘మహారాణి’ మళ్ళీ వస్తుంది.. సీజన్ 4 టీజర్ రిలీజ్..

Huma Qureshi Sony LIV Maharani Web Series Season 4 Teaser Released

Updated On : March 4, 2025 / 1:10 PM IST

Maharani : ఓటీటీలలో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్‌ల్లో ఒక‌టి ‘మహారాణి’. హ్యుమా ఖురేషి మెయిన్ లీడ్ లో బీహార్ రాజకీయాలను ప్రధానాంశంగా తీసుకొని తెరకెక్కించిన మహారాణి సిరీస్ మూడు సీజన్లు పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సిరీస్ నుంచి నాలుగో సీజ‌న్ త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ‘మహారాణి’ సీజ‌న్ 4కు సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

Also Read : Sankranthiki Vasthunam : దేవర రికార్డుని బద్దలు కొట్టిన ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇది మాములు సక్సెస్ కాదు..

గత సీజన్స్ లో చ‌దువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఎదిగిన రాణి భార‌తి (హ్యుమా ఖురేషి) జీవిత ప్రయాణం, ఈ వ్య‌వ‌స్థ‌లో ఆమెకు ఎదురైన స‌వాళ్లు, అధికారంలో ఉన్న ఇబ్బందులు, కుట్ర‌లు, రాజ‌కీయ వైరుద్ధ్యాలు చూపించగా ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంకేం చేస్తుంది అని ఉండబోతున్నట్టు తెలుస్తుంది. గ‌త మూడు సీజ‌న్స్ పెద్ద హిట్ అవ్వగా నాలుగో సీజ‌న్ కూడా మ‌రింత గ్రిప్పింగ్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నుంది. మీరు కూడా మహారాణి సీజన్ 4 టీజర్ చూసేయండి..

త్వరలో మహారాణి సిరీస్ సీజన్ 4 సోనీ లివ్ లో ప్రసారం కానుంది. మరి ఈ సీజన్ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. సీజన్ 5 కి లీడ్ ఇస్తారా ఇంతటితో ముగిస్తారా కూడా చూడాలి.