Sankranthiki Vasthunam : దేవర రికార్డుని బద్దలు కొట్టిన ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇది మాములు సక్సెస్ కాదు..
ఇప్పటికే పలు రికార్డులు సెట్ చేసిన ఈ సినిమా తాజాగా మరో కొత్త రికార్డ్ సెట్ చేసింది.

Venkatesh Sankranthiki Vasthunam Movie Beats Devara Movie and Creates New Record
Sankranthiki Vasthunam : సంక్రాంతి పండక్కి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టిందో అందరికి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఓ మెసేజ్ కూడా ఇస్తూ ప్రేక్షకులను పండగ సమయంలో మెప్పించి పెద్ద హిట్ అయింది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి రీజనల్ తెలుగు సినిమాలో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఇప్పటికే పలు రికార్డులు సెట్ చేసిన ఈ సినిమా తాజాగా మరో కొత్త రికార్డ్ సెట్ చేసింది. సంక్రాంతికి వస్తునాం సినిమా థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఏకంగా 92 సెంటర్స్ లో 50 రోజులు ఆడింది. కొన్ని థియేటర్స్ లో కంటిన్యూగా, కొన్ని థియేటర్స్ లో షిఫ్ట్స్ తో ఈ రికార్డ్ సాధించింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా.
గతంలో 50 డేస్, 100 డేస్ ఇన్ని థియేటర్స్ లో ఆడుతుందని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా థియేటర్స్ లో రెండు వారాలకు మించి ఉండట్లేదు. నెల లోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇటీవలే మార్చ్ 1న జీ 5 ఓటీటీలోకి, జీ తెలుగు ఛానల్ లోకి వచ్చింది. అయినా ఇంకా పలు థియేటర్స్ లో నడుస్తుంది.
ఈ మధ్య కాలంలో 50 రోజులు ఆడిన సినిమాలు అంటే వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. దేవర సినిమా 52 సెంటర్లలో 50 రోజులు ఆడింది. దేవర పాన్ ఇండియా సినిమాగా రిలీజయింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా రీజనల్ సినిమాగా రిలీజయి 92 సెంటర్స్ లో 50 రోజులు ఆడటంతో దేవర రికార్డ్ ని బద్దలు కొట్టింది. మరి ఇప్పట్లో ఈ 50 రోజుల రికార్డుని ఏ సినిమా బద్దలు కొడుతుందో చూడాలి. పాన్ ఇండియా సినిమాని బీట్ చేసి 300 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసి ఈ రికార్డ్ కొట్టడం అంటే మాములు సక్సెస్ కాదు ఇది.
50 DAYS IN 92 CENTRES ❤️🔥#BlockbusterSankranthikiVasthunam continues to RULE THE BOX OFFICE by setting new benchmarks 🔥 #SankranthikiVasthunam brought the festival alive in theatres with its blockbuster entertainment, serving a full-meals treat that audiences had been craving… pic.twitter.com/WLemssDGyh
— Sri Venkateswara Creations (@SVC_official) March 4, 2025