×
Ad

Jason Sanjay : దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్న తమిళ్ హీరో విజయ్ తనయుడు..

తమిళ్ స్టార్ హీరో విజయ్ తనయుడు తన తండ్రి బాటలో కాకుండా తాతయ్య దారిలో వెళ్ళడానికి సిద్ధం అయ్యాడు. హీరోగా కాకుండా దర్శకుడిగా..

  • Published On : August 28, 2023 / 03:52 PM IST

Tamil star Vijay son Jason Sanjay debut as Director in Lyca Productions

Jason Sanjay : తమిళ్ స్టార్ హీరో విజయ్ (Vijay) గురించి సౌత్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ దర్శకుడు ఎస్ ఏ చంద్రశేఖర్ (S. A. Chandrasekhar) వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఇతని వారసుడు ‘జాసన్ సంజయ్’ హీరోగా ఎంట్రీ ఇస్తాడు అనుకుంటే.. తాను మాత్రం తండ్రి బాటలో కాకుండా తాతయ్య దారిలో వెళ్ళడానికి సిద్ధం అయ్యాడు. దర్శకుడిగా తన మొదటి సినిమాని తెరకెక్కించడానికి సిద్దమయ్యాడు. ఇందుకోసం ప్రముఖ తమిళ్ నిర్మాణ సంస్థతోనే ఒప్పందం కుదుర్చుకున్నాడు.

Kangana Ranaut : ‘చంద్రముఖి’గా కంగనా ‘నవరసాల’ ప్రదర్శన చూశారా..?

కోలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ‘లైకా ప్రొడక్షన్స్’ (Lyca Productions) లో జాసన్ సంజయ్ తన మొదటి మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం జాసన్ అగ్రిమెంట్ పై కూడా సైన్ చేశాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ లైకా సంస్థ తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. “తన తాత లెగసీని సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకు వెళ్ళాలి” అంటూ విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. డైరెక్షన్ వైపు వెళ్లాలన్న జాసన్ నిర్ణయాన్ని కొందరి విజయ్ ఫ్యాన్స్ ఆహ్వానిస్తున్నా, కొంతమంది మాత్రం తమ బాధని వ్యక్తం చేస్తున్నారు.

NTR 100 Rupees Coin Release: ఎన్టీఆర్ శతజయంతి స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

హీరోగా ఎంట్రీ ఇస్తాడు అనుకుంటే, ఇలా చేశాడు ఏంటని విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో మాత్రం హీరో విజయ్ ని మాత్రం అభినందిస్తున్నారు. తన కొడుకుని తనలా హీరోగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేయకుండా.. ఇలా తనకి నచ్చిన దారిలో వెళ్ళడానికి ప్రోత్సహిస్తునందుకు శబాష్ అంటున్నారు. ఇది ఇలా ఉంటే, జాసన్ డైరెక్షన్ లో నటించబోయే మొదటి హీరో ఎవరు అని అందరిలో ఆసక్తి నెలకుంది. అలాగే ఏ జానర్ లో సినిమా తీయబోతున్నాడని అరా తీస్తున్నారు. ఈ సందేహాలు అన్నిటికి జవాబులు కావాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.