Bun Butter Jam : తమిళ్ లో హిట్ అయిన సినిమా త్వరలో తెలుగులో.. ‘బ‌న్ బ‌ట‌ర్ జామ్‌’ టీజర్ రిలీజ్..

మీరు కూడా ‘బ‌న్ బ‌ట‌ర్ జామ్‌’ టీజర్ చూసేయండి..

Bun Butter Jam

Bun Butter Jam : రాజు జెయ‌మోహ‌న్‌, ఆధ్య ప్ర‌సాద్‌, భ‌వ్య త్రిఖ హీరో హీరోయిన్లుగా రాఘ‌వ్ మిర్‌ద‌త్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన సినిమా ‘బ‌న్ బ‌ట‌ర్ జామ్‌’. సురేష్ సుబ్ర‌మ‌ణియ‌న్ సమర్పణలో రెయిన్ ఆఫ్ ఎరోస్‌, సురేష్ సుబ్ర‌మ‌ణియ‌న్ నిర్మాణంలో కామెడీ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్ గా తెరకెక్కిన తమిళ సినిమా ‘బ‌న్ బ‌ట‌ర్ జామ్‌’ తమిళ్ లో జులైలో రిలీజయి మంచి విజయం సాధించింది.

ఇప్పుడు ఈ ‘బ‌న్ బ‌ట‌ర్ జామ్‌’ సినిమా తెలుగులో ఆగస్టు 8న శ్రీ విఘ్నేశ్వర ఎంటైన్మెంట్స్ బ్యానర్ పై సిహెచ్ సతీష్ కుమార్ రిలీజ్ చేస్తున్నారు. నేడు బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌ను డైరెక్టర్ మెహ‌ర్ ర‌మేష్ విడుద‌ల చేసి సినిమా తెలుగులో కూడా స‌క్సెస్ కావాల‌ని మూవీ యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. మీరు కూడా ‘బ‌న్ బ‌ట‌ర్ జామ్‌’ టీజర్ చూసేయండి..

Also Read : Usurae : ‘ఉసురే’ మూవీ రివ్యూ.. తమిళ్ డబ్బింగ్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే..

‘బ‌న్ బ‌ట‌ర్ జామ్‌’ టీజ‌ర్‌ చూస్తుంటే.. హీరో పేరెంట్స్, లవ్, కాలేజీ కథతో కామెడీగా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. తమిళ్ లో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.

 

Also Read : Mahavatar Narsimha : 6 కోట్లు పెట్టి తీస్తే.. ఏకంగా ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే.. 800 శాతం కలెక్షన్స్..