Alekhya Reddy : తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్.. నువ్వు లేకుండా పిల్లలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేకపోతున్నా..

తారకరత్నకు ముగ్గురు పిల్లలు అని తెలిసిందే. నిష్క(Nishka) అనే కూతురుతో పాటు తనయ్ రామ్ (Tanay Ram), రేయా(Reya) అనే ఓ పాప, బాబు కవలపిల్లలు కూడా ఉన్నారు.

Alekhya Reddy : తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్.. నువ్వు లేకుండా పిల్లలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేకపోతున్నా..

Tarakaratna Wife Alekhya emotional post on Her Twins Birthday video shared

Alekhya Reddy :  నందమూరి తారకరత్న (Taraka Ratna) గుండెపోటుకు గురయి చికిత్స తీసుకుంటూ ఫిబ్రవరిలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం నందమూరి కుటుంబాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఇక తారకరత్న కుటుంబ సభ్యులు అయితే ఆ బాధ నుంచి బయటకి రాలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తారకరత్న భార్య (Alekhya reddy) సోషల్ మీడియాలో తారకరత్న గురించి ఎమోషనల్ గా అప్పుడప్పుడు పోస్టులు చేస్తుంది.

తారకరత్నకు ముగ్గురు పిల్లలు అని తెలిసిందే. నిష్క(Nishka) అనే కూతురుతో పాటు తనయ్ రామ్ (Tanay Ram), రేయా(Reya) అనే ఓ పాప, బాబు కవలపిల్లలు కూడా ఉన్నారు. నిన్న ఆగస్టు 28న ఈ కవలపిల్లల పుట్టిన రోజు కావడంతో తారకరత్న భార్య ఓ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో పిల్లలు తారకరత్న ఫోటోకి పువ్వులు అర్పిస్తున్నారు. అలాగే పిల్లలతో తారకరత్న ఉన్న పాత ఫోటోలు కూడా ఈ వీడియోలో పోస్ట్ చేశారు.

Shahrukh Khan : ఆ యాడ్ చేసినందుకు షారుఖ్ ఇల్లు ముట్టడికి యత్నం.. యువతని పక్కదారి పట్టిస్తున్నారంటూ..

ఈ వీడియోని షేర్ చేస్తూ.. నేను ఎంత ఆలోచించినా ఈ పిల్లలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేకపోతున్నాను నువ్వు లేకుండా. నువ్వు చాలా అందంగా ఉంటావు. నీ వల్లే నా జీవితం సంతోషంగా ఉంది. నేను, పిల్లలు నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాము. ఈ ట్విన్స్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది అలేఖ్య రెడ్డి. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారగా పలువురు అభిమానులు ఆ చిన్నారులకు కామెంట్స్ లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.