Tarakaratna : సోమవారం సాయంత్రం తారకరత్న అంత్యక్రియలు..

నేడు ఆదివారం ఇంటివద్దే ప్రముఖుల సందర్శనార్థం తారకరత్న పార్థివదేహాన్ని ఉంచుతారు. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో అభిమానులు, ప్రజల సందర్శనార్థం తారకరత్న పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం తారకరత్న అంత్యక్రియలు.............

Tarakaratna :  నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు, అమరావతి.. లాంటి పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులని మెప్పించిన నటుడు తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న తారకరత్న ఎలక్షన్స్ దగ్గరికి వస్తుండటంతో గత కొన్ని రోజులుగా టీడీపీలో యాక్టివ్ గా పనిచేయడం మొదలుపెట్టారు. ఇటీవల నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో బావ నారా లోకేష్ తో పాటు కలిసి నడవటానికి వచ్చారు తారకరత్న. పాదయాత్రలో సడెన్ గా గుండెపోటు రావడంతో కింద పడిపోయారు. వెంటనే కార్యకర్తలు, టీడీపీ నేతలు కుప్పం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగుళూరుకు తరలించారు. గత 23 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న చికిత్స తీసుకుంటూ శనివారం రాత్రి మరణించారు.

తారకరత్న బెంగుళూరు హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, పురంధేశ్వరి.. నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు వెళ్లి పరామర్శించారు. తారకరత్న మరణంతో మరోసారి తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. తారకరత్న పార్థివదేహం శనివారం అర్ధరాత్రి బెంగుళూరు నుంచి హైదరాబాద్ కి తరలించారు. నేడు ఉదయం హైదరాబాద్ లోని తారకరత్న నివాసానికి పార్థివదేహం రానుంది.

Taraka Ratna Number 9 : నందమూరి తారకరత్నకు కలిసిరాని 9 అంకె.. 27న గుండెపోటు, 18న కన్నుమూత..

నేడు ఆదివారం ఇంటివద్దే ప్రముఖుల సందర్శనార్థం తారకరత్న పార్థివదేహాన్ని ఉంచుతారు. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో అభిమానులు, ప్రజల సందర్శనార్థం తారకరత్న పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం తారకరత్న అంత్యక్రియలు సోమవారం సాయంత్రం హైదరాబాద్ ఫిలింనగర్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. తారకరత్న కు తండ్రి మోహనకృష్ణ చేతుల మీదుగా అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు