Tasty Teja
TastyTeja : ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు పూర్తయింది. కళ్యాణ్ పడాలా ఈ సీజన్ విన్నర్ గా నిలిచాడు. విన్నర్ అవుతారు అనుకున్న తనూజ, జబర్దస్త్ ఇమ్మాన్యూల్ టాప్ 5 లో ఉండిపోయారు. అయితే గత సీజన్స్ లో బిగ్ బాస్ కి వెళ్లిన కమెడియన్స్ టేస్టీ తేజ, రోహిణి, అవినాష్.. పలువురు కమెడియన్స్ బిగ్ బాస్ విన్నర్స్ అవ్వలేరు అని వ్యాఖ్యలు చేశారు.(Tasty Teja)
తాజాగా బిగ్ బాస్ ఫేమ్, నటుడు, యూట్యూబర్ టేస్టీ తేజ ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా కమెడియన్స్ బిగ్ బాస్ విన్నర్స్ అవ్వలేరు అనే వ్యాఖ్యలపై ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
Also Read : Ravi Babu : రవిబాబు కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్.. భయపడేవాళ్లు చూడొద్దు.. టైటిల్ ఏంటంటే..?
టేస్టీ తేజ మాట్లాడుతూ.. జనాలు చూసే దృష్టిని బట్టి ఉంటుంది. ఇమ్మాన్యుయేల్ గెలిస్తే బాగుంటుంది. జనాలు అంతా సినిమాలో హీరోలు గెలిస్తే సూపర్ అంటారు. కమెడియన్ గెలిస్తే అంతగా పట్టించుకోరు. కమెడియన్ అంటే అలా ఫిక్స్ అయిపోయారు జనాలు. ఇమ్మాన్యుయేల్ దానికి అతీతుడు అని నాకు అనిపించింది. గేమ్స్ పరంగా, టాస్కుల పరంగా నెక్స్ట్ లెవల్ ఆడాడు.
కానీ ఇమ్మాన్యుయేల్ నామినేషన్స్ లోకి ఎక్కువగా రాకపోవడం వల్ల వాడికి ఓట్ బ్యాంక్ అనేది ఫామ్ అవ్వలేదు. అది అతనికి మైనస్. బిగ్ బాస్ లో జరిగే కంటెంట్ చూసి జనాలు ఓట్ వేస్తారు. నామినేషన్స్ లో ఉంటే ఓట్ వేస్తాము. ఇమ్మాన్యుయేల్ బాగా ఆడినా అభినందిస్తాం కానీ నామినేషన్స్ లో లేకపోతే ఓట్ వేరే వాళ్లకు వేస్తాము. ఇక్కడ అదే హాజరిగింది. ఒకవేళ ఇమ్మాన్యుయేల్ నామినేషన్స్ లో ఉండి ఉంటే ఇమ్మాన్యుయేల్ ని మించిన విన్నర్ లేడు అక్కడ అని అన్నారు. దీంతో టేస్టీ తేజ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Murari Working Stills : మురారి రీ రిలీజ్.. మహేష్ బాబు అప్పటి వర్కింగ్ స్టిల్స్ చూశారా.. ఫొటోలు వైరల్..