Accident : పాపం.. ప్రమోషన్స్ కి వెళ్లొస్తుంటే మూవీ టీమ్‌కి యాక్సిడెంట్.. హీరో, హీరోయిన్స్ కి ఆపరేషన్స్?
ఈ సినిమా హీరోయిన్ దష్విక మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాన్ని తెలిపింది. (Accident)
Accident
Accident : మూవీ టీమ్ లో అందరూ తమ సినిమాల కోసం కష్టపడతారని తెలిసిందే. సినిమా షూటింగ్ సమయంలో లేదా యాక్షన్ సన్నివేశాలలో నటీనటులకు, పలువురు సాంకేతిక నిపుణులకు దెబ్బలు తగలడం, సీరియస్ గాయాలు అవ్వడం జరుగుతూనే ఉంటాయని తెలిసిందే. అయితే ఈ మూవీ యూనిట్ కి మాత్రం సినిమా మొత్తం పూర్తయి రిలీజ్ సందడిలో ఉండగా యాక్సిడెంట్ అయింది.
ఆ సినిమా పేరు తత్వం. దినేష్ తేజ, దష్విక జంటగా తెరకెక్కిన తత్వం సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా రెండు నెలలు వాయిదా పడి అక్టోబర్ 2న రిలీజ్ కాబోతుంది. నేడు ఈ సినిమా హీరోయిన్ దష్విక మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాన్ని తెలిపింది.
Also Read : Bigg Boss Today Promo : నరేష్ ఆన్ ఫైర్.. నేను ఇంకో 20 వారాలు ఉంటా.. భయపడుతున్నారుగా ఉంచుకోండి..
దష్విక మాట్లాడుతూ.. రెండు నెలల క్రితం మేము సినిమా ప్రమోషన్స్ కి తిరుపతి వెళ్లొస్తుంటే దారిలో పెద్ద యాక్సిడెంట్ అయింది. భారీ గాయాలు అయ్యాయి. నా కుడి భుజానికి ఆపరేషన్ కూడా అయింది. ప్లేట్స్ కూడా పెట్టారు లోపల. నెల రోజులు పట్టింది కోలుకోవడానికి. ఇంకా పూర్తిగా చెయ్యిని పైకి లేపలేకపోతున్నాను. ఫిజియో చేయించుకుంటున్నాను. హీరోకి కూడా బలంగా గాయాలు అయ్యాయి. ఆయన ఇప్పటికీ నడుము నొప్పితో బాధపడుతున్నాడు అని తెలిపింది.
దష్వికకు హీరోయిన్ గా ఇదే మొదటి సినిమా. మొదటి సినిమాకే ఇలా అవ్వడం పాపం అని అనుకుంటున్నారు టాలీవుడ్ లో. యాక్సిడెంట్ అయినా కోలుకోవడానికి ప్రయత్నిస్తూనే ప్రమోషన్స్ చేస్తుండటంతో మూవీ టీమ్ ని అభినందిస్తున్నారు.
