Unstoppable episode 4 : కిరణ్ కుమార్ రెడ్డి కెప్టెన్సీలో ఆడిన టీమ్ ఇండియా కెప్టెన్.. ఎవరో తెలుసా?
నందమూరి నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ 'ఆహా'లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. తాజాగా నాలుగో ఎపిసోడ్ కి అతిథిలుగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పటి తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి హాజరయ్యారు. కాగా ఒక్కప్పటి టీమ్ ఇండియా కెప్టెన్, కిరణ్ కుమార్ రెడ్డి కెప్టెన్సీలో ఆడినట్లు బాలకృష్ణ వెల్లడించాడు.

Team India Captain played under the captaincy of Kiran Kumar Reddy
Unstoppable episode 4 : నందమూరి నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇక రెండో సీజన్ మొదటి ఎపిసోడ్‌ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో స్టార్ట్ చేసి సంచలనం సృష్టించారు. తాజాగా నాలుగో ఎపిసోడ్ లో బాలయ్య తన పాత స్నేహితులతో కలిసి సందడి చేశాడు.
Balayya – Pawan Kalyan : అన్‌స్టాపబుల్ షోకి పవర్ స్టార్, త్రివిక్రమ్.. హింట్ ఇచ్చిన బాలయ్య
ఈ ఎపిసోడ్ కి అతిథిలుగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పటి తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి హాజరయ్యారు. వీరు ముగ్గురు కాలేజీ మిత్రులు అవ్వడంతో, ఈ ఎపిసోడ్ ‘గెట్ టూ గెథెర్’ పార్టీ అయ్యిపోయింది. కాగా ఒక్కప్పటి టీమ్ ఇండియా కెప్టెన్, కిరణ్ కుమార్ రెడ్డి కెప్టెన్సీలో ఆడినట్లు బాలకృష్ణ వెల్లడించాడు. అతని లాగా కిరణ్ కుమార్ రెడ్డి కూడా క్రికెటర్ అవుతాడు అనుకున్నా, కానీ సీఎం అయ్యాడు అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరంటే.. దాదాపు 174 వన్ డేలు, 47 టెస్ట్ మ్యాచ్ లకు కెప్టెన్సీ చేసిన ‘మొహమ్మద్ అజహరుద్దీన్’. ఈ క్రికెటర్ కాలేజీలో కిరణ్ కుమార్, బాలయ్యలకు జూనియర్ అంటా. ఆ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి కెప్టెన్సీలో అండర్-19, 22, 25 మ్యాచ్ లు ఆడాడు ఈ క్రికెటర్. అంతేకాదు అజహరుద్దీన్ తన ఆటో బయోగ్రఫీలో కిరణ్ కుమార్ గురించి రెండు పేజీలు కూడా రాసాడట. “హి ఈజ్ మై కెప్టెన్. ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఆడాల్సినవాడు, ఏపీ అసెంబ్లీలో ఆడుతున్నాడు” అంటూ రాసుకోచ్చాడట అజర్.