OG Movie : పవన్ కళ్యాణ్ అభిమానికి అదిరే రిప్లై ఇచ్చిన నిర్మాత.. బర్త్ డేకి టాలీవుడ్..!

పవన్ కళ్యాణ్ బర్త్ డేకి OG మూవీ నుంచి అప్డేట్ ఉంటుందా..? నిర్మాత డివివి రిప్లై ఏంటి..?

teaser from OG Movie on the occasion of Pawan Kalyan birthday

OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘OG’. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తుంది. ఇమ్రాన్ హష్మి విలన్ గా చేస్తుండగా అర్జున్ దాస్, శ్రియారెడ్డి ప్రధాన పాత్రలు కనిపించబోతున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే.

Samantha – Vennela Kishore : సమంత నిర్మాణంలో వెన్నల కిశోర్ మెయిన్ లీడ్‌తో మూవీ..!

దీంతో ఆ రోజు ఏమన్నా అప్డేట్ వస్తుందా..? అని అందరిలో ఆసక్తి నెలకుంది. ఈక్రమంలోనే ఒక నిమిషం నిడివి ఉన్న టీజర్ ని అర్జున్ దాస్ వాయిస్ తో రిలీజ్ చేయబోతున్నారని, ఆ టీజర్ టాలీవుడ్ లోనే బెస్ట్ టీజర్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మూవీ టీం నుంచి మాత్రం ఎటువంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. బర్త్ డే ఇంకో వారం సమయం మాత్రమే ఉంది. దీంతో అభిమానులంతా ట్విట్టర్ లో డివివిని ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. ఈక్రమంలోనే ఒక అభిమానికి డివివి బదులిస్తూ.. “పేల్తాయి అన్ని పేల్తాయి. టాలీవుడ్ లో ఇప్పటి వరకు చూడని హై ని సెప్టెంబర్ 2న చూస్తారు” అని చెప్పి ఫ్యాన్స్ కి హైప్ ఇచ్చేశారు.

Kushi : ఖుషిలో ఆ సీన్ చేయించడం కోసం విజయ్, సమంత.. వెన్నల కిశోర్‌ని ఎంతో రిక్వెస్ట్ చేశారట..

ఇక నిర్మాత నుంచి కూడా బర్త్ డే గిఫ్ట్ పై క్లారిటీ రావడంతో.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ ఫీల్ అవుతున్నారు. కాగా ఈ సినిమా 90’s బ్యాక్ డ్రాప్ లో సాగనుంది. ప్రస్తుతం పవన్ ఈ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. హైదరాబాద్ లోని ప్రత్యేక సెట్ లో పవన్ పై కీలక సన్నివేశాలను దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ షెడ్యూల్ తో పాటు మరో షెడ్యూల్ లో పవన్ పాల్గొంటే చాలు తనకి సంబంధించిన చిత్రీకరణ పూర్తి అవుతుందని తెలుస్తుంది.