Teaser of Shanmukh Jaswant's first movie Premaku Namaskar released
Shanmukh Jaswanth: షణ్ముఖ్ జశ్వంత్.. సోషల్ మీడియాలో మనోడికి ఉన్న ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ తెచ్చకున్నాడు. అతని వీడియోలో ఎక్కువగా వినిపించే “అరే ఏంట్రా ఇది.. అనే డైలాగ్ మీమర్స్ ఇప్పటికీ వాడుతూనే ఉంటారు. ఇక గతంలో షణ్ముఖ్ చేసిన సాఫ్ట్ వేర్ డెవలపర్స్, సూర్య వెబ్ సిరీస్ లు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అప్పటినుంచి తన(Shanmukh Jaswanth) నెక్స్ట్ ప్రాజెక్టు గురించి ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపధ్యలోనే తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు షణ్ముఖ్.
Dhanush: ఇడ్లీ కొట్టు కోసం సింపతీ ట్రై చేస్తున్నాడా.. ధనుష్ ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు?
తన పుట్టినరోజు సందర్బంగా తొలిసారి హీరోగా చేస్తున్న సినిమా అనౌన్స్ మెంట్ వీడియోను విడుదల చేశాడు. ప్రేమకు నమస్కారం అనే టైటిల్ తో వస్తున్న సినిమా నుండి టీజర్ విడుదల చేశాడు. టీజర్ విషయానికి వస్తే, యూత్ ఫుల్ కంటెంట్ తో వస్తున్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. ప్రేమలో మోసపోయిన, బ్రేకప్ అయినా అబ్బాయిలను ఉద్దరించడానికి వచ్చిన జూనియర్ గా ఈ టీజర్ లో కనిపించాడు షణ్ముఖ్. అమ్మాయిల గురించి తన స్టైల్లో లెన్తీ డైలాగ్ చెప్పి అదరగొట్టేశాడు. ఆడియన్స్ నుంచి ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి టీజర్ తో ఆడియన్స్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన షణ్ముఖ్ సినిమాతో ఎలాంటి ట్రీట్ ఇస్తాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.