Dhanush: ఇడ్లీ కొట్టు కోసం సింపతీ ట్రై చేస్తున్నాడా.. ధనుష్ ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు?

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఇడ్లీ కొట్టు. ఇక్కడ మరో విషయం(Dhanush) ఏంటంటే ఈ సినిమాకు స్వయంగా ధనుష్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Dhanush: ఇడ్లీ కొట్టు కోసం సింపతీ ట్రై చేస్తున్నాడా.. ధనుష్ ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు?

Netizens trolling Dhanush over Idli Kottu movie

Updated On : September 16, 2025 / 10:44 AM IST

Dhanush: కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఇడ్లీ కొట్టు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ సినిమాకు స్వయంగా ధనుష్ దర్శకత్వం వహిస్తున్నాడు. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా(Dhanush) అక్టోబర్ 1న విడుదల కానుంది. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఒక ఈవెంట్ లో ధనుష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి.

Films In Telangana: ఫిలిమ్స్‌ ఇన్‌ తెలంగాణ.. చిత్ర పరిశ్రమ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌: దిల్ రాజు

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ధనుష్ మాట్లాడుతూ.. చిన్నతనంలో నాకు ప్రతి రోజూ ఇడ్లీ తినాలని ఉండేది. కానీ, ఎప్పుడో కానీ ఆ కోరిక తీరేది కాదు. ఇప్పుడు స్టార్ హోటళ్లలో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నప్పటికీ ఆ రుచి రావడం లేదని అన్నారు. నా చిన్నతనంలో ఇడ్లీ కొట్టుతో నాకున్న ఎమోషనే ఈ సినిమా”అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇవే మాటలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.ఎందుకంటే, ధనుష్ సీనియర్ దర్శకుడు కార్తీక్ రాజా కుమారుడు అన్న విషయం తెలిసిందే. ధనుష్ పుట్టే సమయానికే ఆయన అసిస్టెంట్ దర్శకుడిగా వర్క్ చేస్తున్నాడు. కాబట్టి, ఇప్పుడు ధనుష్ చెప్తున్నా కష్టాలేవి తాను పడలేదని, కేవలం సినిమా కోసం, ప్రమోషన్స్ కోసమే ఆయన అలా సింపతీ కార్డు వాడుతున్నాడని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.

ఈ ట్రోలింగ్స్ కో ధనుష్ ఫ్యాన్స్ కూడా ఒక రేంజ్ లో కౌంటర్స్ ఇస్తున్నారు. గతంలో సీనియర్ దర్శకుడు, రచయిత విస్సు చెప్పిన వీడియోను వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో ధనుష్ తండ్రి కార్తీక్ రాజా చాలా ఏళ్ళపాటు ఆయన దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాడు. ఆయన దర్శకుడు అవడానికి చాలా టైం పట్టింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆదాయం కూడా అంతంతమాత్రంగానే ఉండేది. వారానికోసారి వాళ్ళ పిల్లలు టీవీ చూడటానికి మా ఇంటికి వచ్చేవారు అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి, ధనుష్ చెప్పింది నిజమే అని, ఆయన్ని ట్రోల్ చేయడం సరికాదని ఆయన ఫ్యాన్ కౌంటర్ ఇస్తున్నారు.